39.2 C
Hyderabad
April 25, 2024 17: 30 PM
Slider విజయనగరం

సైమన్ కమీషనుకు గుండెలు చూపిన ధీరుడు టంగుటూరి ప్రకాశం పంతులు

#depikapatil

విజ‌య‌న‌గ‌రం  జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు జ‌రిగాయి.ఈ సంద‌ర్భంగా ఎస్పీ దీపికా ఎం పాటిల్  టంగుటూరి ప్రకాశం పంతులు గారి చిత్ర పటానికి పూలమాల వేసి, పుష్పాలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక మాట్లాడుతూ – స్వాతంత్ర్య ఉద్యమంలో సైమన్ కమీషను భారతీయుల పై కాల్పులు జరపగా, వారికి ఎదురు నిలిచి తన గుండెలు చూపిన ధీరుడు ఆంధ్ర కేశరిగా  టంగుటూరి ప్రకాశం పంతులు గారు కీర్తింపబడ్డారన్నారు.  ప్రకాశం పంతులు గారు స్వాతంత్ర్య సమర యోధునిగా, న్యాయవాదిగా, రాజకీయ వేత్తగా, రచయితగా, సంపాదకీయునిగా, రాజనీతిజ్ఞునిగా విశేషంగా రాణించి ఆంధ్ర రాష్ట్రానికి జాతీయ స్థాయిలో ఎనలేని కీర్తిని తీసుకువచ్చారన్నారు.

ఆంధ్ర రాష్ట్రానికి ప్రకాశం పంతులు గారు అందించిన సేవలుకు గుర్తుగా ఆయన స్వంత జిల్లా ఒంగోలును 1972లో ఆయన పేరుగా ‘ప్రకాశం’గా నామకరణం చేసారన్నారు. పేద కుటుంబంలో పుట్టిన ప్రకాశం పంతులు గారు, ఎంతో కష్టపడి, వారాల అబ్బాయిగా ఉన్నత చదువులు చదివి, స్వశక్తితో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగారని  జిల్లా ఎస్పీ ఎం. దీపిక అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎఆర్ డిఎస్పీ ఎల్. శేషాద్రి, ఎస్బీ సిఐ జి.రాంబాబు, ఆర్ ఐ లు చిరంజీవి, టివిఆర్ కే కుమార్పి . ఈశ్వరరావు, మరియన్ రాజులు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని  ప్రకాశం పంతులు గారి చిత్ర పటానికి పుష్పాలు సమర్పించి, ఘనంగా నివాళులు అర్పించారు.

Related posts

జగన్ పార్టీ నుండి లీడర్లు పారిపోవడం షురూ!

Satyam NEWS

12వ రోజుకు చేరిన పంచాయితీ కార్మికుల సమ్మె

Bhavani

8వ విడత హరితహారానికి అధికారులు సన్నద్ధం కావాలి

Satyam NEWS

Leave a Comment