29.2 C
Hyderabad
October 13, 2024 16: 01 PM
Slider కృష్ణ

ప్రకాశం బ్యారేజీ డ్యామేజీ: ఆ నీచుడు దొరికాడు!

#prakashambarriageboats

విజయవాడను వరదలు ముంచెత్తుతున్న వేళ జగన్ మోహన్ రెడ్డి చేసిన భారీ కుట్ర బట్టబయలు అయింది. ఎదుటి రాజకీయ పార్టీని దెబ్బ తీసేందుకు ఆయన చారిత్రక కట్టడాలను, కనీసం ప్రజల ప్రాణాలను సైతం జగన్ లెక్కచేయడని ఈ ఘటన ద్వారా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. నాలుగైదు రోజుల క్రితం ప్రకాశం బ్యారేజి గేట్లను వైసీపీ రంగులు ఉన్న పడవలు ఢీకొట్టడం వెనుక కుట్ర కోణం ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలిన సంగతి తెలిసిందే.

ఒక్కో పడవ 40 నుంచి 50 టన్నుల బరువు ఉండగా.. ఏకంగా మూడు బోట్లను తాడుతో కట్టేసి బ్యారేజీ వైపునకు వదిలారు. అంత బరువున్న బోట్లు ఢీకొడితే బ్యారేజి గేట్లు దెబ్బతిని కొట్టుకుపోతాయనే ఉద్దేశంతో ఇలా చేసినట్లుగా అర్థం అవుతోంది. సెప్టెంబరు 2న ప్రకాశం బ్యారేజీకి 11.42 లక్షల క్యూసెక్కుల మేర వరద వచ్చిన సమయంలో అదే రోజు ఉదయం 3 గంటల సమయంలో ఆ పడవలు కొట్టుకువచ్చాయి. 67, 68, 69 గేట్లను ఢీకొట్టాయి. అలా జరిగితే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని, నీటి నిర్వహణ సరిగ్గా లేని చేతకాని ప్రభుత్వంగా ప్రొజెక్ట్ చేయాలనే దురుద్దేశంతోనే పడవలను ఉద్దేశపూర్వకంగా వదిలినట్లుగా భావిస్తున్నారు.

అందుకే ఘాట్ల వద్ద పడవలను గట్టిగా కట్టకుండా వదిలేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తం 5 పడవలు గేట్లను ఢీకొట్టగా.. అందులో మూడు గొల్లపూడికి చెందిన వక్కలగడ్డ ఉషాద్రివే ఉన్నాయని గుర్తించారు. ఈయన సూరాయపాలెంకు చెందిన కోమటి రామ్మోహన్‌కు అనుచరుడు. మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు అత్యంత సన్నిహితుడైన ఎమ్మెల్సీ తలశీల రఘురాంకు.. ఆ రామ్మోహన్‌ దగ్గరి బంధువు అని పోలీసులు గుర్తించారు. మాజీ ఎంపీ నందిగం సురేశ్‌కు.. రామ్మోహన్, ఉషాద్రి తమ లారీల ద్వారా ఇసుక సరఫరా చేసేవారని కూడా పోలీసులు గుర్తించారు.

ఏ బోటు యజమాని అయినా పడవల్ని విడివిడిగా నది ఒడ్డున లంగరు వేసి ఇనుప పోల్స్ కి కట్టి ఉంచుతారు. ఇక్కడ మాత్రం మూడు పడవల్నీ కలిపి ప్లాస్టిక్‌ తాళ్లతో కట్టి ఉంచడం అనేక అనుమానాలకు తావిచ్చింది. కృష్ణా నదిలో నీటిమట్టం పెరుగుతున్న వేళ.. ఏ పడవకు ఆ పడవను లంగరేసి గట్టిగా కట్టాలి. అందరూ బోటు యజమానులు అదే పాటిస్తారు. ఈ విషయాన్ని తోటి యజమానులు హెచ్చరించినా వారు పట్టించుకోలేదని పోలీసుల దృష్టికి వచ్చింది. పెద్ద పడవలైన ఇవి బ్యారేజి వద్దకు కొట్టుకుపోయి ప్రమాదం జరుగుతుందని చెప్పినా నిర్లక్ష్యం చేశారని పోలీసులకు కొందరు వివరించారు.

పలువురు మీడియాతో కూడా ఈ విషయాలను పంచుకున్నారు. ఇలా పోలీసులకు అనుమానం మరింత బలపడడంతో నిందితుల కాల్‌ డేటాతో పాటు, గూగుల్‌ టేకవుట్‌ వివరాల్ని పోలీసులు కలెక్ట్ చేస్తున్నారు. నిందితులుగా భావిస్తున్న రామ్మోహన్, ఉషాద్రిలను పోలీసులు అదుపులోకి తీసుకుని వివరాలు సేకరిస్తున్నారు. అయితే, పడవల్ని కొద్ది రోజుల కిందటే గొల్లపూడి వైపు తెచ్చి నిలిపారని పోలీసులు గుర్తించారు. ముందు అవి గుంటూరు జిల్లా వైపు ఉన్న ఉద్దండరాయనిపాలెం వైపు ఉండేవి. కొద్ది రోజుల కిందటే వీటిని ఎందుకు తెచ్చారు, గొల్లపూడి రేవు దగ్గరున్న శ్మశానం దగ్గర ఎందుకు కట్టి ఉంచారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Related posts

వ్యవసాయ బిల్లు భూమికి చెర, రైతుకు ఉరి

Satyam NEWS

శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన అధ్యక్షుడు రాజపక్స

Satyam NEWS

రిసార్ట్స్ లో డేంజర్ గేమ్స్: యువకుడి మృతి

Satyam NEWS

Leave a Comment