37.2 C
Hyderabad
March 29, 2024 18: 00 PM
Slider ప్రత్యేకం

నిమ్మగడ్డ లేఖకు ప్రవీణ్ ప్రకాశ్ సమాధానం ఇది

#PraveenPrakashIAS

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్.ఎన్.రమేష్ కుమార్ పై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసిన విషయం తెలిసిందే.

ఈ లేఖకు సమాధానంగా ప్రవీణ్ ప్రకాశ్ పలు ఆరోపణలను ఎన్నికల కమిషనర్ పై చేశారు. తన 26 ఏళ్ల సర్వీసులో జూనియర్లపై ఆగ్రహం చూపించి, జూనియర్లను కించపరిచి తన పని చేసుకునే సీనియర్ అధికారిని తాను చూడలేదని ప్రవీణ్ ప్రకాశ్ తెలిపారు.

అదే విధంగా తాను ఏఐఎస్ అధికారులను కించపరిచేవిధంగా ప్రవర్తిస్తానని సీనియర్ అయిన రమేష్ సర్ అనుకోవడం కూడా నమ్మకం అనే విషయం విఫలం అయినప్పుడు మాత్రమే సాధ్యం అవుతుందని అన్నారు.

తాను ఐఏఎస్ అయినప్పుడు ‘‘ఏ సీనియర్ కూడా జూనియర్ ను ఎప్పుడూ జూనియర్ లా చూడరని, ఏ జూనియర్ కూడా సీనియర్ లతో మాట్లాడేప్పుడు తాను జూనియర్ ను అనే విషయం మర్చిపోడు’’ అనే విషయం చెప్పరని ప్రవీణ్ ప్రకాశ్ తెలిపారు.

జూనియర్లు ఏదైనా గొప్ప నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రోత్సహించిన సీనియర్లనే తాను చూశానని ప్రవీణ్ ప్రకాశ్ లేఖలో పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్ పిలను వీడియో కాన్ఫరెన్సుకు రాకుండా తాను అడ్డుకున్నట్లు చేసిన ఆరోపణలను ప్రస్తావిస్తూ హైకోర్టు సింగ్ జడ్జి ఇచ్చిన తీర్పునకు హైకోర్డు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పునకు మధ్య ఎన్నికలకు సంబంధించిన ఏ పనీ జరగలేదని ఆయన అన్నారు.

అదే విధంగా హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చేనాటి నుంచి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే మధ్య కాలంలో కూడా ఏం జరగకూడదని రాష్ట్ర ప్రభుత్వం భావించినందునే అదే విషయాన్ని ఎన్నికల కమిషనర్ కు ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు చెప్పరని ప్రవీణ్ ప్రకాశ్ గుర్తు చేశారు.

ఏఐఎస్ అధికారులు వీడియో కాన్ఫరెన్సుకు రాలేకపోవడానికి అదే కారణం తప్ప తాను వారిని బెదిరించి ఆపడం కారణం కాదని ప్రవీణ్ ప్రకాశ్ తెలిపారు. సాధారణ పరిపాలన ముఖ్య కార్యదర్శిగా తనతో బాటు మరో ఐదుగురు ముఖ్య కార్యదర్శులు ఉంటారని తామంతా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కింద పని చేస్తామని అంతే కానీ స్వతంత్రించి పని చేయడాని అవకాశం లేదని ఆయన వివరించారు.

ఇది కూడా తెలుసుకోకుండా తనపై ఆరోపణలు చేయడం నైతికమా అని ఆయన ప్రశ్నించారు. తనను విశాఖపట్నం, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్ గా ఉన్నప్పుడు ఎన్నికల విధుల నుంచి తొలగించడంపై కూడా ప్రవీణ్ ప్రకాశ్ వ్యాఖ్యానించారు.

 తనను అప్పుడు తప్పించడానికి ఎన్నికలు కారణం కాదని, ఆ తర్వాత తన సేవలను గుర్తించిన ఎన్నికల సంఘం తనను బీహార్ లోని పాటలీపుత్ర, తమిళనాడులోని ఆర్ కె నగర్ లో జరిగిన ప్రతిష్టాత్మక ఎన్నికలకు పరిశీలకుడిగా పంపిందని ఈ విషయాలు గుర్తుంచుకోవాలని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.

Related posts

సుప్రీంకోర్టు తీర్పు తో ముస్లిమ్ రిజర్వేషన్లకు ముప్పు

Satyam NEWS

వైజాగ్ శిల్పారామంలో జాతీయ స్థాయి క్రాఫ్ట్ బజార్

Satyam NEWS

ప్రతి పార్లమెంట్ పరిధిలో 2 బీసీలకే

Bhavani

Leave a Comment