39.2 C
Hyderabad
April 25, 2024 17: 39 PM
Slider సంపాదకీయం

పీఆర్సీ కి విలువ లేకుండా చేస్తున్న ప్రభుత్వం

#Telangana CM KCR 1

పే రివిజన్ కమిషన్ (వేతన సవరణ కమిషన్) కు విలువ తగ్గిస్తున్నది ఎవరు? పీఆర్సీకి సారధ్యం వహిస్తున్నవారా? ఉద్యోగ సంఘాల వారా? రాష్ట్ర ప్రభుత్వమా? వేతన సవరణ కమిషన్ కు విలువ తగ్గిస్తున్నది కచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వమే.

పీఆర్సీ ఇచ్చిన సిఫార్సులను యధాతధంగా అమలు చేయాల్సిన ప్రభుత్వం వాటిని సవరిస్తున్నది. ఉద్యోగులను ప్రసన్నం చేసుకోవడానికి అదనపు భత్యాలు జోడిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఇలా చేసే రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ విలువను తగ్గించేస్తున్నది. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని పీఆర్సీ గా నియమిస్తారు.

అన్ని పరిస్థితులు బేరీజు వేసి సిఫార్సులు

ఆ అధికారి అన్ని స్థాయిలలో చర్చలు జరుపుతారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్థితి ఏమిటి? ఉద్యోగుల జీతాలకు, భత్యాలకు ఎంత ఖర్చు చేయగలదు, బడ్జెట్ కమిట్ మెంట్ ఏమిటి? వీటన్నింటికి నిధులు ఎక్కడనుంచి లభ్యం అవుతాయి, ప్రభుత్వ ప్రాధామ్యాలు కొనసాగించేందుకు వస్తున్న ఆదాయం ఎంత? ఉద్యోగుల జీతభత్యాలు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఎంత మేరకు పెంచవచ్చు లాంటి అనేక పెరామీటర్లను పీఆర్సీ పరిశీలిస్తుంది.

అన్నీ కూలంకషంగా పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వాన్నికి సిఫార్సు చేస్తుంది. ఇంత కరసరత్తు చేసిన తర్వాత ఇచ్చే సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి. అంతే కానీ దానికి భిన్నంగా కొంచెం పెంచడం, ఉద్యోగులను ఆకట్టుకోవడం లాంటి చీప్ జిమ్మిక్కులకు ప్రభుత్వాలు పాల్పడుతున్నాయి.

పిసినారి పీఆర్సీనా????

అందుకే నిజాయితీగా అన్ని పరిస్థితులను అంచనావేసి సిఫార్సులు ఇస్తున్న పీఆర్సీలను ఉద్యోగ సంఘాలు అత్యంత దారుణంగా విమర్శిస్తున్నాయి. ఈ సారి తెలంగాణ ఉద్యోగులైతే ‘‘పిసినారి పీఆర్సీ’’ అంటున్నారు. పీఆర్సీ తన జేబులో నుంచి జీతాలు చెల్లించదు.

చెల్లించాల్సింది ప్రభుత్వమే. మంచి పీఆర్సీ అనిపించుకోవాలంటే 60 శాతం పెంచేయండి అని అనవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయగలుగుతుందా? అంత ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దయార్ద్ర హృదయుడు, మాకు పెంచుతారు అని ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు. అంత దయార్ద్ర హృదయుడైన ముఖ్యమంత్రి తానే నిర్ణయం తీసుకుని పెంచేయవచ్చు కదా?

పీఆర్సీని ఎందుకు నియమించినట్లు? పీఆర్సీ చెబితేగానీ చట్టబద్దంగా ఉండదు. అదీ పీఆర్సీ ప్రాధాన్యత. అందుకే పీఆర్సీలను నియమిస్తారు. ప్రస్తుత పీఆర్సీ సి ఆర్ బిస్వాల్ ఎంతో నిజాయితీ పరుడైన అధికారి. అన్ని విషయాలు తెలిసిన వ్యక్తి అలాంటి అధికారి ఇచ్చిన సిఫార్సులను ఉద్యోగ సంఘాలు ఖండించడానికి వీల్లేదు. అయితే ఉద్యోగ సంఘాలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాయి.

యధాతధంగా అమలు చేయాల్సిందే

ముఖ్యమంత్రిని పొగిడి ప్రసన్నం చేసుకోవడానికి బిస్వాల్ ను తిడుతున్నాయి. ఇది ఎంత మాత్రం క్షమార్హం కాదు. ముఖ్యమంత్రికి నిజంగా పద్ధతులు, రాజ్యాంగ వ్యవస్థలపై నమ్మకం ఉంటే పిఆర్సీ ఇచ్చిన నివేదికను యధాతధంగా అమలు చేయాలి.

ఉద్యోగులు తమకు ఫిట్ మెంట్ 63 శాతం ఇవ్వాలని అడిగారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దాదాపు 30 శాతం వరకు ఇస్తారని ఆశించారు. కనీసం 25 శాతం ఉంటుందని అనుకున్నారు. వేతన సవరణ కమిషన్​ దాదాపుగా 14 నుంచి 15 శాతం వరకు రికమెండ్​ చేసి ఉంటుందని భావించారు.

15 శాతం రికమెండ్​ చేస్తే సీఎం కేసీఆర్​ కు విన్నవించుకుని కనీసం 30 శాతానికి తీసుకోవచ్చని ఊహల్లో ఉన్నారు. కానీ వేతన సవరణ కమిషన్​ మొదట్లోనే నీళ్లు చల్లింది. బేసిక్​ పే మీద 7.5 శాతం ఫిట్​మెంట్​ ఇస్తే సరిపోతుందని నివేదికల్లో పొందుపర్చింది.  

దీనికి సవరణలు చేస్తే, పీఆర్సీ సిఫార్సు చేసిన దానికన్నా భిన్నంగా చేస్తే ఆయనకు ఉద్యోగులలో మంచి పేరు వస్తుందేమో కానీ రాజ్యాంగ పరంగా ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థకు చెడ్డపేరు వస్తుంది.

Related posts

బీజేపీ పతనం ప్రారంభం

Bhavani

నేటితో ముగియనున్న నాగోబా జాతర..

Bhavani

చదువు చెప్పకుండా సిగ్గుమాలిన పని చేస్తున్న టీచర్

Satyam NEWS

Leave a Comment