28.2 C
Hyderabad
April 30, 2025 05: 21 AM
Slider గుంటూరు

క్రీస్తు మార్గం అందరికి అనుసరణీయం

tdp nrt crismas

క్రీస్తు మార్గం అందరికి అనుసరణీయమని నరసరావుపేట నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు. నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అరవింద బాబు ముఖ్యఅతిథిగా పాల్గొని ముందుగా కేక్ కట్ చేసి, కొవ్వొత్తుల వెలుగులతో వైభవంగా వేడుకలను నిర్వహించారు.

పేద, బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి గా క్రీస్తు వెలుగొందారని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. సాధించాలన్న పట్టుదల ఉంటే చాలు ఆస్తులతో సంబంధం లేకుండా ఎంత గొప్ప స్థానాలకైన చేరుకోవచ్చని అన్నారు. యువత వారి నైపుణ్యాలను గుర్తించుకొని వాటికి సానపెట్టి ఉన్నతంగా రాణించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వల్లెపు నాగేశ్వరరావు, మాజేటి వెంకటేష్, కొల్లి బ్రహ్మయ్య ,పులిమి రామిరెడ్డి, గొట్టిపాటి జనార్ధన్ బాబు ,సేసిల్ ,బంగారం తదితరులు పాల్గొన్నారు.

Related posts

పిట్ట కొంచెం కూత ఘనం: అమెరికాలో తెలుగు పిల్లవాడి సత్తా

Satyam NEWS

సిఎంతో యోగి వేమన యూనివర్సిటీ విసి భేటీ

Satyam NEWS

ప్రజా గాయకుడు వంగపండు ఇక లేడు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!