37.2 C
Hyderabad
March 29, 2024 17: 22 PM
Slider మెదక్

గ‌ర్భీణీ స్ర్తీలు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు

Kids

గ‌ర్భీణీ మ‌హిళ‌లు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు, అన్న‌పానీయాలు, మందులు, వైద్యుల స‌ల‌హాలు, వారికి ప్ర‌భుత్వం త‌ర‌ఫున చేప‌ట్టే ప‌లు కార్య‌క్ర‌మాల‌పై సంగారెడ్డిలోని ఫుల్క‌ల్‌లోని ఐసీడీఎస్ బిచ్కుంద సెంట‌ర్‌లో చేప‌ట్టారు. ఈ సందర్భంగా దస్థిరాం మాట్లాడుతూ స్త్రీలు గర్భం దాల్చిన మూడు మాసాల్లో గర్భిణిగా నమోదు చేసుకోవాల‌ని త‌రువాత క్ర‌మం త‌ప్ప‌కుండా మందులు తీసుకోవాల‌న్నారు.

ఆహారంలో తీసుకోవలసిన జాగ్రత్తలు

గర్భిణీ స్త్రీలు అన్ని రకాల ఆహార పదార్ధాలు అంటే ధాన్యాలు, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పాలు, పాలతో చేసిన పదార్ధాలు, మాంసం మొదలైనవి తగిన మోతాదులో తీసుకోవాలి. తల్లికి ఎక్కువగా శక్తి లభించే ఆహార పదార్ధాలు ఇవ్వడం వలన తక్కువ బరువుతో ఉన్న పిల్లలు పుట్టకుండా ఉంటారు. అలాగే కాన్పు సమయంలో, ప్రసవానంతర అత్యవసర పరిస్ధితులకు గురికాకుండా ఆరోగ్యంగా ఉంటారు. గర్భిణీ సమయంలో తల్లి ఆరోగ్యానికి, బిడ్డ పెరుగుదలకు సరిపోయేంత ఆహారం కొంచెంకొంచెంగా ఎక్కువ సార్లు తినాల‌న్నారు.

పోషకాహారంతో పాటు విశ్రాంతి

గర్భిణీ స్త్రీలలో ముఖ్యంగా రక్తహీనత సమస్య ఉంటుంది. దీని వలన బరువు తక్కువ ఉన్న బిడ్డలు పుట్టడం, తల్లికి అధిక రక్తస్రావం కావడం జరుగుతుంది. కాబట్టి ఇనుము ఎక్కువగా ఉన్న ఆహారం అంటే ఆకుకూరలు, బెల్లం, రాగులు, ఎండిన పండ్లు (కర్జూరం, ద్రాక్ష ) , నువ్వులు, చెఱకురసం, ఉలవలు, మాంసం (కాలేయం) తీసుకోవాలి. రోజుకు ఒకటి చొప్పున ఐరన్ మాత్రలు తీసుకోవాలి. పోషకాహారం తీసుకుని ఆరోగ్యం గా ఉన్న స్త్రీకి సుఖప్రసవం జరుగుతుంది. మొదలగు అంశాలను తెల్పినారు అలాగే ప్రతి నిండు గర్భిణి తప్పని సరిగా కోవిడ్ 19 పరీక్షలు చేసుకోవాలని సూచించారు. అంతేగాకుండా స‌రైన పోష‌కాహారంతో పాటు స‌రైన విశ్రాంతి కూడా గ‌ర్భీణీ స్ర్తీల‌కు అవ‌స‌ర‌మ‌ని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు ప్లారెన్సు, శాంత, బలబాయి, లక్ష్మీ, ఆశలు పాల్గొన్నారు.

Related posts

భార్య ఆత్మహత్య.. భర్త ప్రమాదంలో మృతి

Bhavani

దీపావళి నాడు చేయాల్సిన పనులు ఇవి

Satyam NEWS

ప్రతిభ కనబర్చిన అధికారులకు ప్రశంసా పత్రాలు

Satyam NEWS

Leave a Comment