39.2 C
Hyderabad
April 25, 2024 18: 01 PM
Slider విజయనగరం

ముందు జాగ్రత్తలు పాటిద్దాం: కరోనా వ్యాప్తి అరికడదాం

#rajakumariIPS

ప్రజలంతా అప్రమత్తతో ఉండి కోవిడ్ ముందస్తు జాగ్రత్తలు, భౌతిక దూరం, మాస్క్ ధరించడం, సానిటైజర్ తో చేతులను శుభ్రం చేసుకోవడం.. పాటించడం ద్వారా కరోన వైరస్ ను అరికట్టాలని విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి  ప్రజలను కోరారు. 

నగరంలో ని న్యూపూర్ణ జంక్షన్ వద్ద, ప్రకాశం పార్క్ దగ్గరలో, తోపుడు బళ్ళు, చిల్లర వర్తకులు మరియు మేఘన డాక్టర్ ప్లాజా సంయుక్తంగా నిర్వహించిన మాస్క్ లు, శానిటైజర్ లు ఉచితంగా పంపిణీ, కరోన అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ  ముఖ్య అతిధిగా హాజరయి ప్రజలకు, ప్రయాణికులకు మాస్క్ లు, సానిటైజర్ లు ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ముఖ్యంగా మూడు జాగ్రతలతో కరోన వైరస్ ను అరికవచ్చునని, వ్యక్తుల మధ్య సోషల్ డిస్టెన్స్ పాటించడం, మాస్క్ ను తప్పనిసరిగా ధరించడం, సానిటైజర్ తో గాని, సబ్బుతో గాని చేతులను తరుచూ శుభ్రపరుచుకోవడం వంటి ముందస్తు జాగ్రతలు పాటించడం ద్వారా కరోన ను అరికట్టవచ్చునన్నారు.

అలాగే కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వలన వ్యాధి నిరోధక శక్తి పొంది, కరోన వైరస్ సోకిన వైరస్ పై సమర్ధవంతంగా పనిచేసి, పోరాడుతుందన్నారు, కాబట్టి అవకాశమున్న ప్రతిఒక్కరు కరోనా వ్యాక్సిన్ తీసువాలన్నారు. కరోన వైరస్ వలన ఊపిరితిత్తుల మీద పనిచేసి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తితే తప్పకుండ డాక్టర్ ను సంప్రదించి, జాగ్రతలు పాటించాలన్నారు. 

కరోనా రెండవ వేవ్ చాలా వేగంగా విస్తరిస్తున్నందున, ప్రజలందరూ ఎటువంటి నిర్లక్ష్యం ప్రదర్శించకుండా, జాగ్రత్తలు పాటించాలన్నారు. కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కల్పించారు. ప్రస్తుతం కరోనా దేశంలో వేగంగా విస్తరిస్తున్నదని, రోజు రోజుకు కేసులు నమోదు సంఖ్య క్రమంగా పెరుగుతున్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.

ముఖ్యంగా యువత వలన కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని, ఎక్కువగా యువకులు మాస్కులు ధరించడం లేదని ఎస్పీ అన్నారు. మాస్క్ ఉన్నవారికి కరోనా వైరస్ సోకినప్పటికీ వారికి ఉన్న ఇమ్యూనిటీ వలన లక్షణాలు బయటపడవన్నారు. కాని వారు కరోనా కేరియర్లుగా మారి వారి ఇంటిలో ఉన్న కన్నవారు ఇతర కుటుంబ సభ్యులను, ఇతరులకు వైరస్ వ్యాపించే వాహకులుగా మారుతారన్నారు.

ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, ఇంటినుండి బయటకు వచ్చినప్పటినుండి, పనులు ముగించుకొని మరల ఇంటికి చేరుకునే వరకూ ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మాస్కు ధరించాలని, జిల్లా ఎస్పీ కోరారు. సాధ్యమైనంతవరుకు అందుబాటులో ఉన్న వ్యక్తులు వ్యాక్సిన్ తీసుకొనేందుకు ప్రాధాన్యతను ఇవ్వాలన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి. సత్యనారాయణ రావు, ట్రాఫిక్ డీఎస్పీ ఎల్.మోహన రావు, టూటౌన్ సీఐ సి.హెచ్. శ్రీనివాస రావు, ఎస్.ఐ జనార్దన్ పోలీసు సిబ్బంది, వర్తకుల సంఘం అధ్యక్షుడు పట్నాన శ్రీనివాస రావు, తోపుడు బళ్ళు వర్తకులు, మేఘనా డాక్టర్ ప్లాజా ప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.

Related posts

మళ్లీ మూడు రాజధానుల బిల్లు…..?

Satyam NEWS

విశ్వబ్రాహ్మణులకు నిత్యావసర సరుకుల పంపిణీ

Satyam NEWS

నరసరావుపేటలో ఘనంగా గోపూజ ఉత్సవం

Satyam NEWS

Leave a Comment