33.2 C
Hyderabad
April 26, 2024 02: 21 AM
Slider ప్రత్యేకం

ప్రాధాన్యత సంతరంచుకున్న ఆవిర్భావ వేడుకలు

#Emergence Ceremonies

గతంలో ఎన్నటికంటే ఈ సంవత్సరం రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలకు ప్రాధాన్యత పెరిగింది. ఇంతకాలం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో హైదరాబాద్ కేంద్రంగా మాత్రమే జరిగిన వేడుకలు ఈసారి 21 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా జరగనున్నాయి. అన్ని శాఖలను వేడుకల నిర్వహణలో ప్రభుత్వం భాగస్వామ్యం చేస్తున్నది. తొమ్మిదేళ్ళలో సాధించిన ప్రగతిని విస్తృతంగా పబ్లిసిటీ చేయాలనుకుంటున్నది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం సైతం రంగంలోకి దిగుతున్నది.

గోల్కొండ కోట వేదికగా నిర్వహించడానికి కసరత్తు మొదలైంది. మరోవైపు కాంగ్రెస్ సైతం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నది. ఆ పార్టీ సీనియర్ నాయకురాలు ప్రియాంకాగాంధీ ఆధ్వర్యంలో బోయిన్‌పల్లిలోని ఐడియాలజీ సెంటర్‌లో ఆవిర్భావ వేడుకలను నిర్వహించేలా ప్లాన్ చేసింది.అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి

పొందేందుకు మూడు పార్టీలూ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను వాడుకోవాలనుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల పోరు ఈ మూడు పార్టీల మధ్యనే ఉండడంతో ఆవిర్భావ వేడుకలను సైతం ప్రచారానికి, పొలిటికల్ మైలేజ్ పొందడానికి వినియోగించుకోనున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం మొదలు ఈ తొమ్మిదేళ్ళలోని ఘట్టాలను ఏకరువు

పెట్టాలనుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే వేడుకలు జరుగుతున్నా విజయాల పరంపరను ప్రజల్లోకి తీసుకెళ్ళాలని అధికార బీఆర్ఎస్ భావిస్తున్నది. రాజకీయంగా అనుకూలంగా మల్చుకోవాలనుకుంటున్నది.

తెలంగాణను తెచ్చిన పార్టీగా క్రెడిట్ తీసుకోవాలనుకుంటున్నది. ఇందుకు అధికార యంత్రాంగాన్ని వాడుకుంటున్నది.బీజేపీ సైతం కేంద్రంలో అధికారంలో ఉన్న అవకాశాలను రాజకీయంగా వాడుకోడానికి ప్లాన్ చేస్తున్నది. గతేడాది సెప్టెంబరు 17న విమోచన దినోత్సవాన్ని తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా

నిర్వహించింది. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా చీఫ్ గెస్టుగా హాజరై నిజాం సంస్థానం భారత యూనియన్‌లో విలీనమైన చారిత్రక నేపథ్యాన్ని వివరించారు. నిజాం కాలంలోని రజాకార్ల చర్యలనూ ఏకరువుపెట్టారు. ఇప్పుడు రాష్ట్ర ఏర్పాటు విషయంలనూ బీజేపీ కృషిని ఆవిర్భావ ఉత్సవాల వేదికగా ప్రస్తావించాలనుకుంటున్నారు. బీజేపీ మద్దతు ఇచ్చినందువల్లనే పార్లమెంటు ఉభయ సభల్లో తెలంగాణ రాష్ట్ర

ఏర్పాటుకు సంబంధించిన బిల్లుకు ఆమోదం లభించిందని, రాష్ట్ర ఏర్పాటు సాకారమైందనే అంశాన్ని బీజేపీ నొక్కిచెప్పాలనుకుంటున్నది.గతేడాది ఢిల్లీ వేదికగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు జరిగాయి. అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కానీ ఈసారి మాత్రం రాష్ట్రంలోని అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టకుని వేదికను గోల్కొండ కోడ వేదికగా జరపాలనే చర్చ జరుగుతున్నది. కేంద్ర ప్రభుత్వం దీనిపై రెండు మూడు రోజుల్లో స్పష్టమైన ప్రకటన చేయనున్నది.

పార్లమెంటులో బిల్లుపై చర్చ జరిగే సమయంలో కేసీఆర్ సభలోనే లేరనే అంశాన్ని వివరించడంతో పాటు వీడియో ఫుటేజీని కూడా ప్రదర్శించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ మొదటి నుంచీ సానుకూలంగానే ఉన్నదని నొక్కిచెప్పడానికి కాకినాడలో జరిగిన పార్టీ నిర్ణయాన్ని తెరపైకి తేవాలనుకుంటున్నది.

తెలంగాణ ఏర్పాటు కోసం పార్లమెంటులో సుష్మా స్వరాజ్ చేసిన చర్చ, ఆమె చూపిన చొరవను కూడా ‘తెలంగాణ చిన్నమ్మ’ పేరుతో ప్రస్తావించాలనుకుంటున్నది.ఇంకోవైపు సోనియాగాంధీ 2004లోనే కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ (కనీస ఉమ్మడి ప్రణాళిక)లో ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో చర్చించి సానుకూల

నిర్ణయం తీసుకున్నదని రాష్ట్ర ప్రజలకు వివరించాలనుకుంటున్నది. ప్రియాంకాగాంధీని ముఖ్య అతిథిగా ఆహ్వానించి బోయిన్‌పల్లిలోని కాంగ్రెస్ ఐడియాలజీ సెంటర్‌లో ఆవిర్భావ ఉత్సవాలను నిర్వహించడానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. తొలుత సోనియాగాంధీని ఆహ్వానించాని రాష్ట్ర నాయకత్వం భావించినా ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదని పార్టీ వర్గాలు

పేర్కొన్నాయి. కానీ ప్రియంకాగాంధీని మాత్రం రప్పించనున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. ఎలాంటి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింతో కేసీఆర్ పాలనలో ఆ లక్ష్యం నీరుగారిపోయిందని, ప్రజల

ఆశలు, ఆకాంక్షలు నెరవేరలేదని ఈ ఉత్సవాల సందర్భంగా నొక్కిచెప్పాలనేది పార్టీ ప్లాన్.తెలంగాణ ఏర్పాటు అంశాన్ని మూడు ప్రధాన పార్టీలు రాజకీయంగా మైలేజ్ పొందేలా ప్లానింగ్ చేసుకున్నాయి. తెలంగాణ రాష్ట్ర సెంటిమెంట్ అంశం మూడు పార్టీలకూ ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది.

Related posts

ఎయిడెడ్ విద్యా సంస్థలను యథాప్రకారం కొనసాగించాలి

Satyam NEWS

అమెరికా వెబ్ సైట్ ను హ్యాక్ చేసిన ఇరాన్ హ్యాకర్లు

Satyam NEWS

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలి

Satyam NEWS

Leave a Comment