28.7 C
Hyderabad
April 24, 2024 06: 25 AM
Slider గుంటూరు

యుద్ధానికి సిద్ధం: ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలి

రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి. ఇది చారిత్రక అవసరం. అందు కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలి. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు అధికార వైసీపీతో ఢీకొట్టేందుకు సిద్ధంగా ఉండాలని పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు పిలుపునిచ్చారు. నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్యకర్తల,రియల్ టైం స్టాటజీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కొట్ట కిరణ్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు,రియల్ టైం స్టెటజీ కో-ఆర్డినేటర్ గుంటుపల్లి శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా౹౹చదలవాడ మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలన, ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. అందు కోసం గ్రామాల్లో,వార్డులో కార్యకర్తలు రోజుకు నాలుగు గంటలు కేటాయించాలి. సమీప భవిష్యత్తులోనే ఎన్నికలొ స్తాయన్న ఆలోచనతోనే కార్యకర్తలు ఇప్పటి నుంచే ముందడుగు వేయాలంటూ నేతలు కర్తవ్యబోధ చేశారు. నియోజకవర్గంలో టిడ్కో ఇళ్లు, ఇసుక, మద్యం, రేషన్, మట్టి మత్తు పదార్థాల కుంభకోణాల పై పోరాటం చేసేలా వ్యూహరచన చేశామని డా౹౹చదలవాడ వెల్లడించారు. నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,వైసీపీ నాయకులు,అవినీతి ముఖ్యమంత్రిని పాలదోలేందుకు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గలో అక్రమ దందాల పై పోరాటం చేస్తుంటే భయమెందుకని, ఎమ్మెల్యేతో సహా వైసీపీ నాయకులు ఎందుకు వణికిపోతున్నారని ప్రశ్నించారు. నియోజకవర్గాన్ని దోచుకుంటూ ఎమ్మెల్యే లూటీ

చేస్తున్నారన్నారు. పార్టీలో నెలకొన్న లోపాలు,సమస్యలను సరి చేసుకుంటామన్నారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోనుగుంట్ల కోటేశ్వరరావు,రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యమూ, రాజ్యాంగమూ ఖూనీ అయ్యాయని ఆరోపించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై వుందన్నారు.తమ ప్రభుత్వం వస్తుందనే నమ్మకం, ధైర్యం కార్యకర్తల్లో కల్పించాలని నాయకులకు పిలుపిచ్చారు. మూడేళ్ళలో మూడు రోడ్లు వేయలేని జగన్‌ డు రాజధానులు ఎలా కడతారని ప్రశ్నించారు. రాష్ట్రం కోసం చంద్రబాబును సీఎం చేయడానికి పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఆర్డి డైరెక్టర్ వల్లపు నాగేశ్వరావు, నరసరావుపేట మండల పార్టీ అధ్యక్షులు బండారుపల్లి విశ్వేశ్వరరావు, రొంపిచర్ల మండల పార్టీ అధ్యక్షులు వెన్న బాలకోటిరెడ్డి,రాష్ట్ర విభిన్న

ప్రతిభావంతుల అధ్యక్షుడు పూదోట సునీల్,రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు పంగులూరి ఆంజనేయులు చౌదరి,రాష్ట్ర మైనార్టీ నాయకులు మన్నన్ షరీఫ్,మీరావలి, రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి గొట్టిపాటి జనార్దన్ బాబు,జి ల్లా తెలుగు యువత అధ్యక్షుడు కుమ్మేత కోటిరెడ్డి ,జిల్లా మహిళా అధ్యక్షురాలు దాసరి ఉదయ్ శ్రీ,లీగల్ సెల్ అధ్యక్షుడు చెన్నుపాటి నాగేశ్వరరావు,లీగల్ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి అలీ భాష,సంఘం డైరీ మాజీ డైరెక్టర్ మక్కన ఆంజనేయులు,రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి పొనుగోటి శ్రీనివాసరావు,నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు జల్లిపల్లి శేషమ్మ,నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు మాబు,నాయకులు బొడ్డపాటి,మెట్టు వెంకటేశ్వర్ రెడ్డి,కొల్లి వెంకటేశ్వర్లు, కడియాల తాండవ కృష్ణ,అబ్బూరి శ్రీనివాసరావు,ముప్పాళ్ళ నాగేశ్వరావు, గాడిపర్తి సురేష్, చితిరాల బాలు టీడీపీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.

ఎం ఎస్ సుధాకర్, సత్యంన్యూస్.నెట్, పల్నాడు జిల్లా

Related posts

దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ కు ఒకే ధర ఉండాలి

Satyam NEWS

స్టిల్ కంటిన్యూ:ఇరాక్ ఫై మరో రాకెట్ దాడి ఇరాన్ పనేనా

Satyam NEWS

సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల సంయుక్త కథనం క్షీరసాగర మథనం

Satyam NEWS

Leave a Comment