33.2 C
Hyderabad
April 25, 2024 23: 05 PM
Slider తూర్పుగోదావరి

కోవిడ్ మూడో దశ ఎదుర్కొనేందుకు కార్యాచరణ ప్రణాళిక

#East Godavari Collector

తూర్పు గోదావరి జిల్లాలో మూడో దశ కరోనా ను ఎదుర్కొనేందుకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

గురువారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో కోవిడ్ మూడో దశ సన్నద్ధతపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, నోడల్ అధికారులు‌, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి లతో కలిసి జిల్లా కలెక్టర్ డి మురళీధర్ రెడ్డి సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మూడో దశ కోవిడ్ ముప్పు పొంచి యున్నందున ఆసుపత్రిలో సాధారణ ,ఆక్సిజన్, ఐసియు పడకలను, వెంటిలేటర్స్, ఆక్సిజన్ సిలిండర్ ఇతర  మౌలిక సదుపాయాల కల్పన పై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు .నియోనటల్ పడకలు కూడా తగినన్ని అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు.

ప్రతి ఆస్పత్రికి నోడల్ అధికారులు నిరయమించడం జరిగిందని , నోడల్ అధికారులు క్రమం తప్పకుండా ఆసుపత్రులను తనిఖీ చేయాలి అన్నారు. కోవిడ్ మూడో దశను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సరైన  కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి డా.కేవిఎస్ గౌరీశ్వరరావు, జిల్లా ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్ డా.పీ రాధాకృష్ణ,జేడ్పీసీఇవో ఎన్ వివి.సత్యనారాయణ, ఏపీఎంఐసి ఇంజనీర్లు,ఇతర అధికారులు హాజరయ్యారు.

Related posts

మంత్రాలయ పీఠాధిపతి కి ఆహ్వానం పలికిన దేవాలయ చైర్మన్

Bhavani

టీడీపీ సీనియ‌ర్ నేత అశోక్ పుట్టిన రోజు సంద‌ర్బంగా ర‌క్తాదానం…!

Satyam NEWS

కార్మికులకు కనీస వేతనాలు అందచేయాలి

Satyam NEWS

Leave a Comment