36.2 C
Hyderabad
April 23, 2024 22: 33 PM
Slider ముఖ్యంశాలు

సీఎం కేసీఆర్ పై రాష్ట్రపతి చర్యలు తీసుకోవాలి

#drbrambedkar

రాజ్యాంగం పై సీఎం కెసిఆర్ పలికిన తప్పుడు మాటలు వెనుకకు తీసుకునేలా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను ఆందోళన రూపంలో తెలియజేయాలని తెలంగాణా రాష్ట్ర అంబేడ్కర్ యువజన సంఘం బాధ్యతగల పౌరులను కోరింది. తెలంగాణా రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితుడే అని బహిరంగ వాగ్దానం చేసి, మోసగించి రాష్ట్రానికి సీఎం అయిన కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు 7 సంవత్సరాలు రాష్ట్ర సీఎంగా పరిపాలించిన అధికార గర్వంతో అన్నం పెట్టిన రాజ్యాంగానికి సున్నం పెట్టాలని చూస్తున్నాడని వారన్నారు. విశ్వ విజ్ఞాని డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 03 ప్రకారం చిన్న రాష్ట్రాలు ఏర్పడాలని వాదించి తెలంగాణ రాష్ట్రం సాధించామని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఇప్పుడు అదే రాజ్యాంగాన్ని అవమానిస్తున్నాడని వారు తెలిపారు. రాజ్యాంగాన్ని అవమానపర్చిన  సీఎం కెసిఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలంగాణా రాష్ట్ర అంబేడ్కర్ యువజన సంఘం డిమాండ్ చేసింది. అంతర్జాతీయ స్థాయిలో 34 డిగ్రీలు సాధించి, 06 పిహెచ్డీలు చేసిన డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్నే మార్చాలి అనడం కేంద్రంలోని మనువాద బీజేపీ ప్రభుత్వానికి, తెలంగాణా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న అహంకార టిఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న లోపాయకారి సంబంధాన్ని వెల్లడిస్తున్నదని వారన్నారు. భారత రాజ్యాంగ  పట్ల అగౌరవంగా మాట్లాడిన కెసిఆర్ పై రాష్ట్రపతి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్

Related posts

ఐదు గురు వరంగల్ వాసుల మృతదేహాలు లభ్యం

Satyam NEWS

ఎన్ టీ ఆర్ నేషనల్ లెజెండరీ అవార్డ్స్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ

Satyam NEWS

ఒకే కుటుంబంలో 11 మంది ఆత్మహత్య

Satyam NEWS

Leave a Comment