36.2 C
Hyderabad
April 23, 2024 21: 35 PM
Slider జాతీయం

రాష్ట్రపతి సెక్యూరిటీ సిబ్బందిలో కరోనా కలకలం

తాజాగా ఒకేసారి 19 మంది పోలీసులకు కరోనా సోకడం కలకలం రేపుతోంది. భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సెక్యూరిటీలోని సిబ్బందికి రావడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలే ఉత్తరాఖండ్​రుషికేశ్‌లోని పరమార్థ నికేతన్ వద్ద ‘గంగా హారతి’ కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్రపతి రామ్‌నాథ్​కోవింద్. ఈ కార్యక్రమంలో భద్రతా విధులు నిర్వర్తించేందుకు వచ్చినవారిలో 19 మంది అధికారులు, సిబ్బందికి కరోనా నిర్ధారణ కావడం కలకలం సృష్టించింది.

ముందుజాగ్రత్త చర్యగా, అందరూ అధికారులను ప్రస్తుతం వారివారి సొంత జిల్లాల్లో ఐసొలేషన్‌లో ఉంచారు. రిషికేశ్‌లోని పరమార్థ్ నికేతన్ ఆశ్రమంలో విధులు నిర్వహిస్తున్న 7 మంది పోలీసులకు పౌరి ఆరోగ్య శాఖ లక్ష్మణ్ ఝూలా పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన పరీక్షల్లో వైరస్ సోకినట్లు తేలింది. వీరిలో ముగ్గురు చమోలి జిల్లా నుంచి, ఇద్దరు రిషికేశ్‌ నుంచి, ఒకరు రుద్రప్రయాగ్‌ నుంచి, ఒకరు దేవప్రయాగ్‌ నుంచి భద్రతా విధుల్లో ఉన్నారు.19 మంది బాధితుల్లో 14 మంది పోలీసు సిబ్బంది కాగా, మిగతా ఐదుగురు వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు, అధికారులున్నారు.

Related posts

జంట హత్యలు..బీహార్ గ్యాంగ్ ఘాతకం

Bhavani

ములుగు జిల్లా కేంద్రంలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి

Satyam NEWS

బసవతత్వానుభవ మంటప ఉత్సవంలో పాల్గొన్న హరిష్

Satyam NEWS

Leave a Comment