తెలంగాణ రాష్ట్రం ఇప్పుడే పుట్టిన చంటిబిడ్డ లాంటిది, స్వతహాగా గైనకాలజిస్టునైన తనకు ఆ బిడ్డని ఎలా పెంచాలో తెలుసని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర్ రాజన్ అన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ పాలకమండలి సభ్యులు రాజ్ భవన్ ay గురువారం నాడు ఆమెను మర్యాద పూర్వకంగా కలిసారు. తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రజలందరూ సమష్టిగా కృషి చేయాలని ఆమె కోరారు. స్వతహాగా డాక్టరైన తనకు చంటిబిడ్డ లాంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి పథంలో నడిపించాలనే విషయం తెలుసని, అందుకు అన్ని వర్గాల ప్రజలు కృషి చేయాలని ఆమె కోరారు. తెలంగాణ ప్రజలు చాలా మంచివాళ్ళని ఆమె అభిప్రాయపడ్డారు. గవర్నర్ ను కలిసిన వాళ్ళలో ప్రెస్ క్లబ్ హైదరాబాద్ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజమౌళి చారి, కోశాధికారి సూరజ్ వి. భరద్వాజ్, ఉపాధ్యక్షులు వేణు నాయుడు, రెహన బేగం, జాయింట్ సెక్రెటరీలు చిలుకూరి హరి ప్రసాద్, కంబాలపల్లి కృష్ణ, సభ్యులు అనిల్ కుమార్, కస్తూరి శ్రీనివాస్, వసంత్ కుమార్, రజినీకాంత్,గణేష్, ఉమాదేవి, కట్టా కవిత, నంద్యాల భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.