ఎస్సి, ఎస్టి కమీషన్ ద్వారా జిల్లాలలో Civil Rights Day కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి అభినందనలు తెలిపారు. శుక్రవారం బిఆర్.కె.ఆర్ భవన్ లో ఎస్సి, ఎస్టి కమీషన్ ఛైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్ అధ్యక్షతన కమీషన్ సభ్యులు సి.యస్ ను కలిసారు. ఈ సమావేశంలో ఎస్సి వెల్ఫేర్ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, ఎస్టి సంక్షేమ శాఖ కార్యదర్శి బెన్ హర్ మహేష్ దత్ ఎక్కా. కమీషన్ సభ్యులు, కార్యదర్శి కరుణాకర్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సి, ఎస్టి కమీషన్ ఛైర్మన్ కమీషన్ చేపట్టిన కార్యక్రమాలను సి.యస్ కు వివరించారు. వచ్చే నెల 30 న కమీషన్ నిర్వహించే Civil Rights Day లో పాల్గొననున్నట్లు తెలిపారు. ఎస్సి,ఎస్టి లపై Atrocities తగ్గేలా చూడాలని, ఏమైన సంఘటనలు జరిగినప్పుడు బాధితులకు సహాయం త్వరగా అందేలా చూడాలని అన్నారు. ఆన్ లైన్ లో ధరఖాస్తులు సమర్పించేలా వెబ్ సైట్ ను త్వరిత గతిన అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఎస్సి, ఎస్టి కమీషన్ ఛైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలలో Civil Rights Day దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని, 8% నుండి 85% శాతానికి పెంచామని, ప్రతి జిల్లాలో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటి సమావేశాలు నిర్వహిస్తున్నామని సి.యస్ కు తెలిపారు. ప్రజల నుండి వచ్చిన ధరఖాస్తులు పెండింగ్ లు లేకుండా వెంటనే పరిష్కరిస్తున్నామన్నారు. Protection of Civil Rights, Prevention of Atrocities చట్టాలపై అవగాహనకు విస్తృత ప్రచారాన్ని నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అట్రాసిటి భాదితులకు వెంటనే సహాయం అందించేలా చూస్తున్నామన్నారు. పెండింగ్ ఏరియర్స్ ను చెల్లించామన్నారు. కమీషన్ జిల్లాలలో లో విస్తృతంగా పర్యటించి ప్రజలల్లో భరోసా కల్పిస్తున్నదని, Prevention of Atrocities, Protection of Civil Rights, చట్టాలతో పాటు ఎస్సి, ఎస్టి సంక్షేమ కార్యక్రమాలు సమర్ధవంతంగా అమలు కావటానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. IG, PCR Cell ద్వారా 6 వేల కేసులకు సంబంధించి 40 కోట్లను పెండింగ్ బకాయిలు చెల్లించామని సి.యస్ కు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాలకు, కనుగుణంగా దేశంలో రోల్ మోడల్ గా నిలిచేలా కమీషన్ పనిచేస్తున్నట్లు తెలిపారు.
previous post