39.2 C
Hyderabad
March 28, 2024 14: 53 PM
Slider మహబూబ్ నగర్

నియంత పాలన ఇంకానా…. ఇంకెంత కాలం??

#kollapurpolice

ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా బిజెపి నాయకులను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ వనపర్తి పర్యటనకు వస్తున్నారని చెబుతూ ఉదయం 5 గంటలకు కొల్లాపూర్ పోలీసులు బిజెపి నాయకులను అరెస్టు చేశారు. ఎక్కడో కేసీఆర్ పర్యటనకు వస్తుంటే తమను అరెస్టు చేయడం ఏమిటని బిజెపి నేతలు ప్రశ్నిస్తున్నారు. అయినా ముఖ్యమంత్రి పర్యటనకు వస్తుంటే తమను అరెస్టు చేయడం ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణ లో నియంత పాలన నడుస్తున్నదా? అంటూ వారు మండిపడ్డారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో బిజెపి నాయకులు ఇమ్రాన్ ఖాన్, మెంటే శివ కుమార్, కాశీపురం మహేష్ ఉన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని వారన్నారు. అందుకే నియంతలాగా తమ స్వేచ్ఛను అడ్డుకుంటున్నారని, ఇంకొన్ని రోజులే ఈ నియంత పాలన సాగుతుందని ఆ తర్వాత ప్రజలు తిప్పికొట్టే రోజు దగ్గరకు వచ్చిందని వారు హెచ్చరించారు. పెద్ద పెద్ద నియంతలే కనుమరుగైపోయిన చరిత్ర ఉందని, కేసీఆర్ పెద్ద లెక్క కాదని వారన్నారు.

Related posts

ఓట్ల రిగ్గింగు దొంగలు ఒక చోట దొరికి పోయారు

Satyam NEWS

వైద్యులకు పీపీఇ కిట్లను అందించిన మంత్రి

Satyam NEWS

లిబియాలో తప్పిపోయిన యువకులు క్షేమం

Satyam NEWS

Leave a Comment