23.5 C
Hyderabad
November 29, 2021 17: 44 PM
Slider నల్గొండ

ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ సర్వసభ్య సమావేశం

#society

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ  సర్వసభ్య సమావేశం సోమవారం  జరిగింది. ఈ సమావేశానికి సంఘ అధ్యక్షుడు  యరగాని శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సంఘంలో గడిచిన ఆరు నెలల వ్యవధిలో జరిగిన వ్యాపార వ్యవహారాలు,ధాన్యం కొనుగోళ్ల సమీక్ష,రైతుల ఋణాల పంపిణీ వివరములను రైతులకు వివరించారు.

వానాకాలపు (2021) ధాన్యం కొనుగోళ్ల కేంద్రాలను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించేలా చూస్తానని,రైతులు ధాన్యాన్ని కళ్లాల వద్దే తూర్పార పట్టి నిమ్ము శాతం 16 వుండేలా చూసుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. వరికి ప్రభుత్వ మద్దతు ధర ఎ గ్రేడ్ కి 1960 రూపాయలు గాను,బి గ్రేడకు ధర 1940 రూపాయలు వున్నదని తెలియజేశారు. సంఘం ద్వారా కొత్తగా దీర్ఘకాలిక ఋణాలు మంజూరికి అవకాశం వున్నందున రైతులు వినియోగించుకోవాలని అన్నారు.  

ఈ సమావేశంలో ఉపాధ్యక్షుడు  కంచెర్ల మధుసూదన్ రెడ్డి,డైరెక్టర్లు  మీసాల శ్యామ్ సుందర్,రాయల వెంకటేశ్వర్లు,దుగ్గి బ్రహ్మం,కటారు శ్రీను, గోసుల శ్రీను,భూక్యా లచ్చీరామ్ నాయక్, కందుల పద్మ,కౌన్సీలర్లు యరగాని గురవయ్య,రైతులు యరగాని సత్యం, కిరణ్ రెడ్డి,ఐల వెంకన్న,రేపాకుల వెంకన్న, దుగ్గి పాండు,చీకాకుళ్ల చారి,యారగని సత్యనారాయణ, వడ్లనాపు వెంకటేశ్వర్లు, వట్టికూటి వెంకటేశ్వర్లు,నరాల సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

బాలినేనిని మంత్రి వర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలి

Satyam NEWS

ధనవంతులు కాదు కానీ పెద్ద మనసున్న మహిళలు

Satyam NEWS

రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోండి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!