27.7 C
Hyderabad
March 29, 2024 01: 40 AM
Slider ప్రత్యేకం

దివాలాతీసిన ఏపి విషయంలో ప్రధాని జోక్యం చేసుకోవాలి

#Raghuramakrishnam Raju MP

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని, రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా చేస్తున్న అప్పుల విషయంలో ప్రధాని జోక్యం చేసుకోవాలని వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు కోరారు. ఈ మేరకు ఆయన నేడు లోక్ సభ జీరో అవర్ లో ప్రస్తావించారు. ద్రవ్య నియంత్రణ, బడ్జెట్ నిర్వహణ చట్టం (ఎఫ్ ఆర్ బి ఎం) నియంత్రణలు దాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు చేస్తోందని ఆయన లోక్ సభ దృష్టికి తీసుకువచ్చారు. రాజ్యాంగం లోని 293 నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఉల్లంఘిస్తున్నదని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇదే విధంగా ఉపేక్షిస్తే పలు జాతీయ బ్యాంకులు కుప్పకూలుతాయని, తద్వారా రాష్ట్రం దివాలా తీస్తుందని ఆయన అన్నారు. రాజ్యాంగ పరంగా ఈ దుస్థితిని అధిగమించేందుకు తక్షణమే ప్రధాని జోక్యం చేసుకోవాలని న రఘురామకృష్ణంరాజు కోరారు.

Related posts

టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి కి అవమానం…

Satyam NEWS

పదోన్నతుల కోసం విద్యా మంత్రికి టిఎస్పిటిఎ వినతి

Satyam NEWS

సిఎం జగన్ బావ బ్రదర్ అనిల్ కారుకు ప్రమాదం

Satyam NEWS

Leave a Comment