28.7 C
Hyderabad
April 20, 2024 04: 36 AM
Slider జాతీయం ముఖ్యంశాలు

సరి కొత్త కాశ్మీరాన్ని నిర్మిద్దాం కలిసి రండి

pm-narendra-modi-759-1

జమ్మూ కాశ్మీర్ ను యావత్ దేశంతో కలిపి ముందుకు తీసుకువెళ్లేందుకే ఆర్టికల్ 370ని రద్దు చేసినట్లు ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ లో ఏ కొత్త పని చేయాలన్నా ఆర్టికల్ 370 అడ్డు తగులుతున్నదని అందువల్ల అక్కడి ప్రజలకు చేయాల్సినంతగా చేయలేకపోతున్నామని ఆయన అన్నారు. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ పునర్ విభజన చట్ట రూపంలోకి వచ్చిన తర్వాత ఆయన నేడు దేశ ప్రజల ను ఉద్దేశించి ప్రసంగించారు. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదం పెచ్చుమీరి పోవడం వల్ల ప్రగతి సాధ్యం కావడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ అడ్డంకులను దూరం చేసి కాశ్మీర్ సోదరులను జనజీవన స్రవంతిలోకి తీసుకువచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని మోడీ స్పష్టం చేశారు. కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఉండటం వల్ల ఫలితాలు త్వరగా కనిపిస్తాయి. పారదర్శకత, కొత్త పని విధానం అభివృద్ధికి బాటలు వేస్తుంది. కొత్త విద్యుత్‌ ప్రాజెక్టులు, నూతన రహదారులు వస్తాయి. కొత్త రైల్వే లైన్లు, విమానాశ్రయాలు ఏర్పాటు చేయడానికి వీలుకలుగుతుంది అని ఆయన విశదీకరించి చెప్పారు. విద్యాహక్కు చట్టం దేశమంతా అమలైనా కాశ్మీర్‌లో కాలేదు. కాశ్మీర్‌ బాలలు ఏం పాపం చేశారు? అని ఆయన ప్రశ్నించారు. జమ్మూకాశ్మీర్‌, లద్దాఖ్‌లో ప్రపంచస్థాయి పర్యాటక ప్రాంతాలు అనేకం ఉన్నాయి. పర్యాటక రంగంలో కాశ్మీర్‌ను అత్యున్నతస్థాయిలో నిలబెట్టాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. కాశ్మీర్‌లో పర్యాటక రంగ పరిస్థితులను కల్పించాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు అక్కడ అనేక సినిమాల చిత్రీకరణ జరుగుతుండేది. హిందీ, తెలుగు, తమిళం చిత్ర పరిశ్రమలను కాశ్మీర్‌ వరకు తీసుకెళ్లాలి. అక్కడ షూటింగ్ లు గతంలో మాదిరిగా జరపాలి. దీనివల్ల స్థానికులకు ఉపాధి మెరుగవుతుందని అని ప్రధాని తెలిపారు. కొత్త పరిశ్రమలు, కొత్త వ్యవస్థల ఏర్పాటులో ప్రైవేటు సంస్థలు కాశ్మీర్కు ప్రాధాన్యమివ్వాలి. ప్రతిభావంతులైన యువత కాశ్మీర్‌లో ఉంది. వారికి సరైన మార్గదర్శనం చేయాలి. కొత్త స్పోర్ట్స్‌ అకాడమీలు, స్టేడియాలు ఏర్పాటు చేయాలి. కాశ్మీర్‌ కళాకారుల ఉత్పత్తులు, లద్దాఖ్‌ సేంద్రీయ ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్‌కు అందజేయాలి. లద్దాఖ్‌లో దొరికే ఒక మూలిక ఆక్సిజన్‌ తక్కువగా ఉండే ఎత్తైన పర్వత ప్రాంతాల్లో ఉండేవారికి ఒక సంజీవిని లాంటిది. మంచుకొండల్లో ఉండే సైన్యం, యాత్రికులకు ఇది సంజీవిని ఇలాంటి వాటిని మార్కెటింగ్ చేసుకుంటే అక్కడి రైతులకు స్వయం ఉపాధి కలుగుతుందని ప్రధాని తెలిపారు. జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 అమలును ఆయుధంగా మలచుకొని పాకిస్థాన్‌ నిరంతరం ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. జమ్మూకాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి తొలగించి చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. దేశ ప్రజల అభ్యున్నతి కోసం చేసిన చట్టాలన్నీ ఇకపై కాశ్మీర్‌కు కూడా వర్తిస్తాయన్నారు. కాశ్మీర్‌లో ఉగ్రవాదం, కుటుంబవాదం తప్ప సాధించిదేమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. జమ్మూకశ్మీర్‌-లద్దాఖ్‌లో కొత్త శకం ప్రారంభమైందని చెప్పారు. ఆర్టికల్‌ 370 రద్దుతో సర్దార్‌ వల్లభ్‌బాయ్‌ పటేల్‌, శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ స్వప్నం సాకారమైందన్నారు.

Related posts

వైసిపి ఆవిర్భావం దినోత్సవం కాదు అరాచక దినోత్సవం

Satyam NEWS

అట్టల ఫ్యాక్టరీ లో భారీ అగ్నిప్రమాదం

Satyam NEWS

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో పల్స్ పోలియో

Satyam NEWS

Leave a Comment