Slider ప్రపంచం

ప్రధాని మోడీ సాహస యాత్ర

PM-Modi-In-Man-verses-Wild

ప్రధాని నరేంద్రమోడీ ఒక సాహసం చేశారు. టీవీలో రాబోతున్న ఓ అడ్వెంచర్ షోలో ఆయన కనిపించనున్నారు. అది కూడా మామూలు అడ్వెంచర్ కాదు. అడవిలో జంతువుల మధ్య తిరుగుతూ షో చేయడం. మీకు డిస్కవరీ ఛానల్ చూసే అలవాటు ఉంటే ఈ షోపై ఇప్పటికే మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది. బియర్ గ్రిల్స్ అడవిలో జంతువుల మధ్య తిరుగుతూ ఉంటారు. ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ పేరిట ప్రసారమయ్యే ఈ షోలో ఇప్పుడు మోడీ కూడా పాల్గొన్నారు.  బియర్ గ్రిల్స్ తో కలిసి మోడీ కూడా అడవుల్లోకి ప్రవేశించి అక్కడి జంతుజాలాలు, పాములు వంటి వాటి మధ్య తిరుగుతూ వాటిని పరిశీలించారు. ఈ షో ఆగస్టు 12వ తేదీన టీవీల్లో ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోని తాజాగా విడుదల చేశారు. దీనిని ట్విట్టర్ లో షేర్ చేయగా… చాలా మంది దీనిని చూసి షాకవ్వడం విశేషం. ఈ ప్రోమోలో మోడీ నదిలో పడవలో ప్రయాణించడం, అడవిలో మృగాల నుంచి కాపాడుకునేందుకు బడసెలను చేత పట్టుకొని కనిపించారు. ఉత్తరాఖండ్ అడవుల్లో ఉన్న జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ లో దీనిని షూట్ చేశారు. వన్య ప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా మోడీ ఈ షోలో పాల్గొన్నారు.

Related posts

ఏపీ ఎన్నికల పరిశీలకుడిగా తెలంగాణ మాజీ ఎన్నికల అధికారి

Satyam NEWS

మందకృష్ణ మాదిగను పరామర్శించిన సీతక్క

Satyam NEWS

నిబంధనలు అతిక్రమించే ప్రైవేట్ ట్రావెల్స్ పై కఠిన చర్యలు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!