28.7 C
Hyderabad
April 20, 2024 06: 50 AM
Slider ఖమ్మం

ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత

#grievence

గ్రీవెన్స్ డే లో ప్రజలు సమస్యల పరిష్కారానికి సమర్పించిన దరఖాస్తులకు ప్రాధాన్యత నిచ్చి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు.  జిల్లా కలెక్టర్, ఐడిఒసి సమావేశ మందిరంలో గ్రీవెన్స్ డే నిర్వహించి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. స్వీకరించిన దరఖాస్తులను పరిష్కారానికి ఆదేశాలు ఇస్తూ, సంబంధిత శాఖ అధికారికి అందజేశారు.  ఈ సందర్భంగా నేలకొండపల్లి మండలం సదాశివపురం గ్రామానికి చెందిన చిర్రా వెంకటేశ్వర్లు తాను కంటి చూపు లోపం ఉన్నవాడినని, సదరం సర్టిఫికెట్, ఆసరా పెన్షన్ మంజూరు కొరకు కోరగా, డిసిహెచ్ఎస్ కు తగు చర్యకై కలెక్టర్ ఆదేశించారు. పెనుబల్లి మండలం, ముత్తగూడెం కు చెందిన బి. సుబ్బారావు, తాను వికలాంగుడినని, తన కుమార్తె బిఎస్సి నర్సింగ్ చదువుతున్నట్లు, ప్రభుత్వం నుండి సహాయం కొరకు దరఖాస్తు చేయగా, జిల్లా సంక్షేమ అధికారికి తగుచర్యకై కలెక్టర్ ఆదేశించారు. పెనుబల్లి మండలం, తెలగవరం కె.డబ్ల్యు (మర్లకుంట) నుండి వేముల శ్రీనివాసరావు, తనకు సర్వే నెం. 34/ఇ/2 లో 0.14 కుంటలు, సర్వే నెం. 334/1/1 లో 4.20 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని, అట్టి భూమికి రైతుబంధు డబ్బులు జమకావట్లేదని, విచారించగా అట్టి సర్వే నెంబర్లు ఆన్లైన్ లో మిస్ అయినట్లు, విచారించి తగుచర్యకై కోరగా, పెనుబల్లి తహసీల్దార్ ను తగుచర్యకై ఆయన ఆదేశించారు.

ఖమ్మం కస్బా బజార్ నుండి కె. లక్ష్మణ్ రావు, తన నాన్నకు స్వతంత్ర సమరయోధుల కోటా క్రింద వైఎస్సార్ కాలనీ, సర్వే నెం. 37 లో స్థలం కేటాయించగా, కొందరు వ్యక్తులు ఆక్రమించుకొనుటకు ప్రయత్నిస్తున్నారని దరఖాస్తు చేయగా, తహసీల్దార్ ను తగుచర్యకై కలెక్టర్ ఆదేశించారు. కూసుమంచి మండలం పెరికసింగారం నుండి ముత్తయ్య వృద్దాప్య పెన్షన్ మంజూరుకు దరఖాస్తు చేయగా, డిఆర్డీఓ ను తగుచర్యకై కలెక్టర్ ఆదేశించారు. తిరుమలాయపాలెం మండలం, బంధంపల్లి నుండి కె. రాములు, తనకు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులని, తన పిల్లలు తమను పట్టించుకోవడం లేదని దరఖాస్తు చేయగా, ఆర్డీవో కు తగుచర్యకై కలెక్టర్ ఆదేశించారు. ఖమ్మం రూరల్ మండలం, తీర్థాల రెవిన్యూ, పొలిశెట్టిగూడెం గ్రామం నుండి రైతులు సర్వే నెం. 620 భూమి ధరణి పోర్టల్ లో నమోదుకు కోరగా, ధరణి విభాగాన్ని తగుచర్యకై కలెక్టర్ ఆదేశించారు. స్థానిక జహీర్ పుర, గుట్టలబజార్ నుండి అరెపల్లి ఝాన్సీ, ఆర్టీసీ కాలనీ, పెద్దతాండ నుండి పద్మలీల లు రెండుపడకల ఇండ్ల మంజూరుకు కోరగా, హౌజింగ్ డిఇ ని తగుచర్యకై కలెక్టర్ ఆదేశించారు. పెనుబల్లి మండలం కుప్పెనకుంట్ల గ్రామ దీపచెర్వు ఆయకట్టుదారులు, తాము స్వంత ఖర్చులతో మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటామని, అనుమతికై కోరగా, తహసీల్దార్ కు తగుచర్యకై కలెక్టర్ ఆదేశించారు.

ఖమ్మం జిల్లా బ్రాయిలర్ కోళ్ల రైతుల సంఘం వారు, వ్యవసాయ రంగ అనుబంధ సంస్థ అయిన బ్రాయిలర్ కోళ్ల ఫారం రైతుల సమస్యల పరిష్కారం కొరకు దరఖాస్తు చేయగా, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారికి తగుచర్యకై కలెక్టర్ ఆదేశించారు. ఎర్రుపాలెం మండలం మామూనూరు నుండి ఎస్కె. అమీర్ బీ, తన వ్యవసాయ కనెక్షన్ పునరుద్ధరణ, దాని రక్షణ కు దరఖాస్తు చేయగా, విద్యుత్ అధికారులను తగుచర్యకై కలెక్టర్ ఆదేశించారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశమై, రికార్డుల నిర్వహణ, పాత రికార్డుల ఖండనంపై సమీక్ష చేసి, సూచనలు చేశారు. ఫైళ్ళన్ని తప్పనిసరిగా ఈ-ఆఫీస్ ద్వారా నిర్వహించాలన్నారు. స్వంత భవనాలు ఉండి, ఐడిఓసి కి కార్యాలయం తరలించిన శాఖలు, వారి వారి పాత భవనాలు కేటాయించిన కార్యాలయాలకు వెంటనే అప్పగించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్. మధుసూదన్, జిల్లా రెవెన్యూ అధికారిణి శిరీష, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

నీట్, ఐఐటీ ఔత్సాహిక విద్యార్థులకు యల్ హెచ్ యల్ కంచన ఫౌండేషన్

Satyam NEWS

NEW How To Lower Blood Pressure Without Taking Medicine Instant Remedy For Bp High Teva 928 Pills Blood Pressure

Bhavani

27 న భారత్‌ బంద్‌ ను జయప్రదం చేయాలి: అఖిలపక్షం పిలుపు

Satyam NEWS

Leave a Comment