మొన్నటిదాకా ప్రయివేట్ బస్సుల వ్యాపారులు కిరాయిల దందా చేశారు. సంపాదించారు. దానికిలెక్కలేదు. అప్పుడే అలా ఉంటే ఇప్పుడు ఎలా ఉంటారో ప్రజలు అర్థం చేసుకోవాలి. సంపాదనకు మరింత అవకాశం వచ్చింది. మరి ఊరుకుంటారా!అస్సలు ఊరుకోరు. అందినంత తీసుకుంటారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సమ్మెలో ఉంది కదా, ఇదే అవకాశంగా వారు దండుకుంటున్నారు. ఈ ప్రయివేటు ఆపరేటర్లు ప్రయాణికులతో ముక్కు పిండి వసూలు ఆదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు. దానికి టికెట్ లేదు. ఎలాపడితే అలా వసూలు చేస్తున్నారు. దీనికి కొల్లాపూర్ ఒక ఉదాహరణ. ఇక్కడ ఉన్న నాయకులు అలాగే తయ్యారు అయ్యారు. ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రజా ప్రతినిధులు లేరు. కొల్లాపూర్ ప్రాంత ప్రజలు హైదరాబాద్ కు వెళ్లాలన్న, రావాలన్నా ప్రయివేట్ బస్సులకు అదనపుగా డబ్బులు ఇవ్వాల్సిందే. ప్రయివేట్ బస్సుల యజమానులు ప్రజలతో అవకాశం దొరికిందని దోచుకుంటున్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చేస్తామంటున్నారు మరి ప్రజలతో అధిక డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నట్లు? ప్రభుత్వం దీనికి సమాధానం ఇస్తుందా? ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం ఇస్తారా? అసలే దసరా పండుగ అవకాశం వచ్చింది. ప్రయివేటు వాళ్లు ప్రయాణీకుల్ని పిండేస్తున్నారు. ఎక్స్ ప్రెస్ బస్సులో కొల్లాపూర్ నుండి హైదరాబాదు కు ప్రయాణం చేయాలంటే ఆర్టిసి చార్జి కన్నా అదనంగా 50 నుండి 80 రూపాయలు చెల్లించు కో వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ అంశంపై మాట్లాడే నాయకుడు కరువయ్యారని ప్రజలు అంటున్నారు. పోలీస్ లే భద్రత కల్పించి ప్రయాణం చేయిస్తున్నారు. అంతవరకూ ఓకే కానీ అధిక చార్జీలకు ఓ విధంగా వాళ్లు కూడా సహకరిస్తున్నాట్లు ఉందని చర్చ చేసుకుంటున్నారు. ప్రవేట్ డ్రైవర్స్,కాండక్టర్స్ లకు పోలీస్ ల భయం ఉంటే ఈవిధంగా ఎందుకు వసూలు చేస్తారని అనుకుంటున్నారు
previous post
next post