28.7 C
Hyderabad
April 20, 2024 07: 34 AM
Slider ముఖ్యంశాలు

రిమైండర్: జగనన్నా మమ్మల్ని మరచిపోయావా అన్నా?

#Ambedkar

లాక్ డౌన్ సమయంలో ఎవరిని ఉద్యోగాల నుంచి తీసేయద్దని, అందరికి జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించినా ఏ ప్రయివేటు విద్యా సంస్థా పాటించడం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ దిద్దే అంబేడ్కర్ అన్నారు. ముఖ్యంగా రవీంద్ర భారతి విద్యాసంస్థలు సిబ్బందికి జనవరి నెల నుంచి ఇవ్వడం లేదని, నారాయణ, శ్రీ చైతన్య విద్యా సంస్థలు ఏప్రిల్ మే నెల జీతాలు ఇవ్వమని చెబుతున్నారని ఆయన అన్నారు.

ఆదిత్య విద్యాసంస్థలు మార్చి నెలలో జీతాలు ఇచ్చి మిగిలినవి ఇవ్వకుండా ఎగ్గొట్టారని, కేశవ రెడ్డి విద్యాసంస్థలు మార్చి నుంచి జీతాలు ఇవ్వడం లేదని అంబేద్కర్ తెలిపారు. భాష్యం విద్యా సంస్థలు మార్చి నెల నుంచి జీతాలు ఇవ్వడం లేదని ఆయన వివరించారు. ఇక బడ్జెట్ స్కూల్స్ కాలేజీలో పరిస్థితి దారుణంగా ఉందని ఆయన తెలిపారు.

 ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా ప్రైవేట్ టీచర్ల కోసం ప్రత్యేక చట్టాన్ని చేస్తానని హామీ ఇచ్చారని అంబేద్కర్ గుర్తు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో కూడా పెట్టి మరి హామీ ఇచ్చారని, దాన్ని నిలబెట్టుకోవడం కోసం పాఠశాల, కాలేజీలకు విడివిడిగా ఫీ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ను  నియమించారని ఆయన తెలిపారు.

ఈ కమిషన్ అన్ని స్కూల్స్ కాలేజీలు తిరుగుతూ అక్కడ ఉన్న సమస్యలను గుర్తిస్తూ పరిష్కారం కోసం ప్రత్యేక చట్టాన్ని రూపొందించే ప్రయత్నం చేస్తోందని ఆయన తెలిపారు. ప్రభుత్వం జీర్ణించుకోలేని దోపిడీ దారులైన ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకుని ప్రైవేటు టీచర్ల లెక్చరర్ కనీస హక్కులను పొందకుండా చేసే ప్రయత్నం చేస్తుందని, అందుకోసం ముఖ్యమంత్రి తక్షణ చర్యలు తీసుకుని ప్రయివేటు టీచర్లను, లెక్చరర్లను కాపాడాలని, వారు ఇచ్చిన హామీని నిలబెట్టు కోవాలని కోరారు.

Related posts

రాంగ్ గోపాల్ వర్మ చిత్రం పోస్టర్ విడుదల

Satyam NEWS

కేంద్ర నిర్ణయంతో గల్ఫ్ కార్మికులకు తీవ్ర నష్టం

Satyam NEWS

బండయప్ప స్వామి పుణ్య తిథి

Satyam NEWS

Leave a Comment