35.2 C
Hyderabad
April 20, 2024 17: 26 PM
Slider కడప

కోవిడ్  బాధితులకు  వైద్యం చేయం అని బోర్డ్ పెట్టడం సరికాదు

#TDPKadapa

కడప జిల్లా లోని  ప్రైవేట్ ఆసుపత్రులు కోవిడ్ రోగులను చేర్చుకోము అంటూ బోర్డ్ పెట్టడం సరైన నిర్ణయం కాదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు ఆర్.శ్రీనివాస రెడ్డి అన్నారు. ఇటువంటి సమయంలో ఇరు వర్గాలు (ప్రభుత్వం, ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం) సామరస్య పూర్వకంగా చర్చించుకుని సమస్య పరిష్కారం చేసుకోవాలని ఆయన కోరారు.

ఇది ఇలాగే కొనసాగితే ప్రజలకు కోలుకోలేని నష్టం జరుగుతుంది. ఇప్పటికయినా సరిదిద్దుకోవాలి లేకుంటే ప్రజల ప్రాణాలు నష్టం కలుగుతుందని ఆయన అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రజలకు అత్యవసర సమయాల్లో కొంత ఉదారత చూపుతూ ప్రజలకు వైద్యం అందించాలని అన్నారు.

ప్రభుత్వం, ప్రైవేట్ ఆస్పత్రుల మీద కక్ష ధోరణి చూపకుండా ,వాళ్ళతో స్నేహపూర్వక వాతావరణం లో ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులతో చర్చించి కోవిడ్ రోగులకు మెరుగైన వైద్యని అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ప్రైవేటు ఆసుపత్రిలో ప్రాణాలను సైతం లెక్క  చేయకుండా  డాక్టర్లు, సిబ్బంది కరోన  వారియర్స్ గా సేవలందించాల్సిన  అవసరం ఉంది కాబట్టి, వారి అభిప్రాయలు కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. ప్రైవేట్ అస్పత్రులపై ప్రభుత్వం  బెదిరింపు,కక్ష ధోరణితో వ్యవహరిస్తే వారికి వచ్చే నష్టం ఏమి లేదని ,ప్రభుత్వం కూడా వారితో సమన్వయం తో నడవాలని అన్నారు.

ప్రైవేట్ అస్పత్రులపై ఉక్కుపాదం చూపిస్తే వారికి వచ్చే నష్టం ఏమి లేదని ,అంతిమంగా నష్టపోయేది ప్రజలే అని అన్నారు. ప్రైవేట్ డాక్టర్లు,ప్రైవేట్  అస్పత్రులు ప్రాణాలను లెక్క చేయకుండా వైద్యం అందిస్తున్నారు,అధిక ధరల విషయం పై ప్రభుత్వం వారితో చర్చించాలని అన్నారు. ప్రభుత్వం,  ప్రైవేట్ ఆసుపత్రి వారిని బెదిరించి ప్రభుత్వం వారితో సేవ తీసుకోవాలన ప్రభుత్వ ఆలోచన మంచిది కాదని అన్నారు.

ఈ విషయం పై జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి  ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలతో మీటింగ్ ఆరెంజ్ చేసి ,వాళ్లకి కౌన్సిలింగ్ ఇచ్చి ,వాళ్ళలో మనోధైర్యాన్ని నింపి మరింత మెరుగైన  సేవలను ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేయాలని అన్నారు.

Related posts

పి సి.సి ప్రతినిధిగా అల్లం ప్రభాకర్ రెడ్డి

Satyam NEWS

ఒంటిమిట్ట లో వేడుకగా ధ్వజారోహణం..

Satyam NEWS

గోల్నాక లో మహిళలకు ఘన సన్మానం

Satyam NEWS

Leave a Comment