27.7 C
Hyderabad
April 18, 2024 08: 09 AM
Slider గుంటూరు

దోచుకుంటున్న ప్రయివేటు ఆసుపత్రులు

#MIMNarasaraopet

గుంటూరు జిల్లా నరసరావుపేట లో వున్న ప్రెవేట్ కోవిడ్ సెంటర్స్ వారు అధిక ఫీజులు వసూలు చేస్తున్నా అధికారులు పటించుకోవడం లేదు. దీనికి నిరసన గా స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ఎంఐఎం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వినతి పత్రం ఇచ్చారు.

ఈ సందర్బంగా ఎంఐఎం పార్టీ జిల్లా కార్యదర్శి మస్తాన్ వలి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కరోనా, కేసులను, ఆరోగ్యశ్రీ లో చేర్చి, కరోనా సోకినా, వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక్కరూపాయి ఖర్చు కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రోగి కోలుకున్న తరువాత అతనికి రెండు వేలు రూపాయలు కూడా గతంలో ఇచ్చారు.

అయితే అందుకు విరుద్ధం గా ఇప్పుడు, ప్రెవేట్ కోవిడ్ సెంటర్స్ వారు ఆరోగ్యశ్రీ నిబంధనలు తుంగలో తొక్కి ఒక్కక కోవిడ్ ప్రెసెంట్ దగ్గర రెండు లక్షలనుంచి మూడు లక్షల వరకు వసూలు చేస్తున్నారని ఆయన అన్నారు. అలాంటి వారిపై విచారణ జరిపి కట్టిన  చర్యలు తీసుకోవాలని అలాగే అనుకోకుండా ప్రెవేట్ కోవిడ్ సెంటర్స్ లో  ప్రమాదాలు  జరిగితే తక్షణమే నివారించటానికి వసతులు వున్నాయా లేవా అనేది కూడా అధికారులు పరిశీలించాలని ఆయన కోరారు.

కోవిడ్ నియామాలు పాటించని వారిపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి వారి హాస్పిటల్ అనుమతులు కూడా రద్దు చేయాలి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో బీసీ నాయకులు కందికట్టు కృష్ణ, pdm జిల్లా కన్వీనర్ రామకృష్ణ mim నాయకులు నాసర్ వలి అబూబకర్ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.

Related posts

మంత్రి అల్లోలకు శుభాకాంక్షల వెల్లువ

Satyam NEWS

కరోనాలోనూ వైసిపి కుంభకోణాలు-కక్ష సాధింపు గర్హనీయం

Satyam NEWS

పెంచిన సినిమా టిక్కెట్ ధరలను వెంటనే తగ్గించాలి: ఎస్ఎఫ్ఐ

Satyam NEWS

Leave a Comment