37.2 C
Hyderabad
April 18, 2024 22: 09 PM
Slider నల్గొండ

ప్రైవేటు ల్యాబ్ లను తనిఖీ చేసిన డి ఎం హెచ్ ఓ

#CovidTestCenter

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని  ప్రైవేటు ల్యాబ్ లను సూర్యాపేట డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ కర్పూరం హర్షవర్ధన్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు.

ఇటీవల రెండు ప్రైవేటు ల్యాబ్ లు  కోవిడ్ పరీక్షలు నిర్వహించి అమాయకుల నుంచి డబ్బులు గుంజుతున్నారని  మీడియాలో వచ్చిన కథనాలకు స్పందించి ఆ రెండు ల్యాబ్ లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

కోవిడ్ పరీక్షలు నిర్వహించారా లేదా అనే దానిపై ఆరా తీశారు. బాధితులతో ఫోన్ లో సంప్రదించి కేసు పూర్వాపరాలు తెలుసుకున్నారు.

పూర్తి విచారణ జరిగిన తర్వాత తగు చర్యలు తీసుకుంటామని, అలాగే అనుమతి లేకుండా ల్యాబ్ లు నడిపినా, కొవిడ్ పరీక్షలు నిర్వహించిన చట్టరీత్యా నేరమని  చర్యలు చేపడతామని తెలిపారు.

డిప్యూటీ DM & HO డాక్టర్ ఎండి నిరంజన్ మాట్లాడుతూ నిబంధనలకు వ్యతిరేకంగా  పరీక్షలు నిర్వహించినా, అధిక ఫీజులు వసూలు చేసినా, అర్హతలు లేని వారు పరీక్షలు చేసినా చట్టరీత్యా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

ఈ తనిఖీలో డెమో తిరుపతి రెడ్డి, సిసి భాస్కర్ రాజు పాల్గొన్నారు.

Related posts

తక్షణం స్పందించి ప్రాణాలు కాపాడిన పోలీసులకు ప్రోత్సాహకాలు..!

Satyam NEWS

తొమ్మిది నెలల నిరీక్షణ: సినిమా థియేటర్ల పున ప్రారంభం

Satyam NEWS

రాజధాని కోసం రాష్ట్రపతికి పోస్టు కార్డులు

Satyam NEWS

Leave a Comment