23.7 C
Hyderabad
September 23, 2023 09: 48 AM
Slider ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్‌పై నిషేధం

YS Jagan Review Meeting_2_0

ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్‌పై నిషేధం విధించేందుకు  ఆరోగ్యం రంగంపై నిపుణుల కమిటీ ఇచ్చిన సిఫార్సులను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అంగీకరించారు. ఆ మేరకు జీతాలు పెంచాలన్న కమిటీ సిఫార్సులను కూడా ముఖ్యమంత్రి అంగీకరించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు తయారుచేయాలని ఆయన అధికారులకు ఆదేశం ఇచ్చారు. ఇదే సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. అవి: హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని 150 ఆస్పత్రుల్లో సూపర్‌ స్పెషాలిటీ సేవలకు ఆరోగ్యశ్రీ వర్తింపు, నవంబర్‌ 1 నుంచి ప్రారంభం, డిసెంబర్‌ 21 నుంచి ఆరోగ్యకార్డుల జారీ ప్రారంభం, ఆరోగ్యశ్రీ జాబితాలోకి అదనంగా వ్యాధులు, పశ్చిమగోదావరి జిల్లాలో ఆరోగ్యశ్రీ పైలెట్‌ ప్రాజెక్టు అమలు, మిగిలిన జిల్లాల్లో 1200 వ్యాధులను ఆరోగ్యశ్రీలోకి తీసుకొస్తూ పైలట్‌ ప్రాజెక్టు కింద అమలు, ఆపరేషన్‌ చేయించుకున్నవారికి కోలుకునేంత వరకూ విశ్రాంతి సమయంలో నెలకు రూ.5వేల చొప్పున సహాయం, కొత్తగా వైద్యుల భర్తీకోసం నోటిఫికేషన్‌, ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బంది కొరతలేకుండా సదుపాయాలు, మెడికల్‌ కాలేజీల తరహాలో నర్సింగ్‌ కాలేజీలపైన కూడా పర్యవేక్షణ, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని 150 ఆస్పత్రుల్లో సూపర్‌ స్పెషాలిటీ సేవలకు ఆరోగ్యశ్రీ వర్తింపు ఈ సమావేశంలో ముఖ్యమంత్రి తోబాటు ఉపముఖ్యమంత్రి ఆళ్ల నాని, డాక్టర్‌ సుజాతారావు సహా నిపుణుల కమిటీలో సభ్యులు, సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు.

Related posts

కరోనా ఎఫెక్ట్: దేశంలో ప్రింట్ మీడియా షట్ డౌన్ తప్పదా?

Satyam NEWS

గుర‌జాడ విశ్వ‌విద్యాల‌య స్థాప‌న‌: విద్య‌, ఉద్యోగావకాశాలకు మేలిమ‌లుపు

Satyam NEWS

డెంకాడ‌, పూస‌పాటిరేగ‌ నామినేష‌న్ల కేంద్రాల‌ను ప‌రిశీలించిన ఎస్పీ

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!