ఇండోర్- వారణాశి మార్గంలో ప్రైవేటు రైలు నడపనున్నట్లు రైల్వే బోర్డు ఛైర్మన్ వినోద్‌కుమార్ యాదవ్ తెలిపారు. ప్రైవేటు గా ఐఆర్‌సీటీసీ దిల్లీ-లఖ్‌నవూ, అహ్మదాబాద్-ముంబయి మధ్య తేజస్ పేరిట రెండు రైళ్లను నడుపుతుండగా తాజాగా ఇండోర్- వారణాశి రూట్‌లో మూడో రైలు నడపనున్నట్లు తెలిపారు. రాత్రి పూట నడిచే ఈ రైల్లో స్లీపర్ కోచ్‌లు, హంసఫర్ తరహాలో కోచ్‌లు ఉండనున్నాయి. వారానికి మూడు రోజుల పాటు ఈ రైలు నడవనుంది. అందులో రెండు రోజులు వయా లఖ్‌నవూ రూట్‌లో, ఇంకో రోజు వయా అలహాబాద్ రూట్‌లో నడవనుంది. ఫిబ్రవరి 20 నుంచి ఈ ప్రైవేటు రైలు పట్టాలెక్కే అవకాశం ఉంది.