30.3 C
Hyderabad
March 15, 2025 10: 27 AM
Slider వరంగల్

అస్మదీయుల కోసం విద్యావిలువలకు తిలోదకాలు

#Bandi Sudhakar Gowd

శాసనమండలి, శాసనసభ ప్రోరోగ్ చేసి మరునాడే దొడ్డిదారిన తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీలను ఆర్డినెన్స్ తీసుకొచ్చి తెలంగాణ ప్రభుత్వం  వ్యవస్థీకృత తప్పిదం చేసిందని తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బండి సుధాకర్ గౌడ్ అన్నారు.

ప్రభుత్వం కేవలం తమ అస్మదీయులకు, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ప్రైవేటు యూనివర్సిటీలను ధారాదత్తం చేసి తెలంగాణ లో విద్యా ప్రమాణాలు తిలోదాకాలిచ్చేందుకు ఈ ప్రయత్నం చేశారని ఆయన అన్నారు. ప్రభుత్వ యూనివర్సిటీల్లో రెగ్యులర్ నియామకాలు చేపట్టడం చేతకాక ప్రైవేట్ యూనివర్సిటీలను తీసుకొచ్చి విద్యా వ్యాపారానికి తెర లేపిందని ఆయన అన్నారు.

మంత్రి వర్గ ఉపసంఘం పై ఒత్తిడి తెచ్చి అనుకూలంగా రిపోర్ట్ ఇప్పించుకుని ప్రైవేట్ యూనివర్సిటీ ల ఆర్డినెన్స్ ను గవర్నర్ చేత ఆమోదించుకున్నారని బండి సుధాకర్ గౌడ్ అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఉండాల్సిన యూనివర్సిటీల ఏర్పాటును అభాసుపాలు చేసి కనీస విద్యా ప్రమాణాలు పాటించకుండా ఏర్పాటు చేయడం విద్యా వ్యాపారానికి నిదర్శనమని ఆయన అన్నారు.

పేద,మధ్య తరగతి విద్యార్థులకు ఉన్నత విద్య అందని ద్రాక్షలాగానే మిగిలేలా వుందని ఆయన విమర్శించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీ ల ఏర్పాటు విషయం పునరాలోచించి అన్ని వర్గాలను సంప్రదించి నిర్ణయం తీసుకుని నాణ్యమైన ఉన్నత విద్య ను అందించాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు.

Related posts

రైస్ మిల్ డ్రైవర్ల, యాజమాన్యం మధ్య చర్చలు విఫలం

Satyam NEWS

వనపర్తి దేవాలయాల్లో ఎమ్మెల్యే తూడి పూజలు

Satyam NEWS

బిఓసిడబ్ల్యు కార్డుతో భీమా సౌకర్యం

Satyam NEWS

Leave a Comment