36.2 C
Hyderabad
April 23, 2024 20: 13 PM
Slider నల్గొండ

మన భారతదేశ సంపద మనమే కాపాడుకోవాలి

#Roshapati

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రైవేటీకరణ దూకుడుగా అమలు చేస్తుందని,బ్యాంకులు, ఎల్ ఐ సి, రైల్వే తో పాటు మరికొన్నింటిని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వివిధ రూపాల్లో ఉద్యోగ సంఘాలు తీసుకున్న ఉద్యమాల్లో కార్మికవర్గం పెద్ద ఎత్తున పాల్గొని మద్దతు పలకాలని జిల్లా సిఐటియు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం లోని CITU  కార్యాలయంలో శనివారం మహిపాల్ అధ్యక్షతన జరిగిన బజారు హమాలి వర్కర్స్ యునియన్  సిఐటియు అనుబంధ సంఘ సమావేశంలో పాల్గొన్న రోషపతి మాట్లాడుతూ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వివిధ రంగాల్లో ఐక్య పోరాటాలుకి రైతు పోరాటాలు మాదిరిగానే సమాయత్తం అవుతున్నాయని, అందులో ప్రధానంగా మార్చి 15, 16వ, తేదీలలో రెండు రోజులు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ ,(ఐ ఎఫ్ బి యు) ఆధ్వర్యంలో రెండు రోజులు సమ్మె జరుగుతుందని, మార్చి 15న  (Ufbu)సాధారణ భీమా సంస్థల సమ్మె 18న,LIC ఉద్యోగులు సమ్మెలో పాల్గొని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పాల్గొని మన భారతదేశ ఆస్తులు మనమే కాపాడుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యుడు యలక సోమయ్య గౌడ్, బజారు హమాలి యూనియన్ సంఘ అధ్యక్షుడు మైపాల్, చింతకాయల పర్వతాలు, రాజేష్ ,కొండలు, శ్రీను, ప్రేమ్, ముత్తయ్య, వెంకన్న,నరేష్,వినోద్,రాము‌, తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆదిలాబాద్ లో ప్రజావాణి కార్యక్రమం రద్దు

Satyam NEWS

మందు బాబులకు అడ్డాగా మారిన విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్…!

Satyam NEWS

కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ అందుకున్న బండారి లక్ష్మారెడ్డి

Satyam NEWS

Leave a Comment