27.2 C
Hyderabad
October 21, 2020 19: 32 PM
Slider జాతీయం

బాపట్ల ఎంపిపై రఘురాముడి హక్కుల నోటీసు

#RaghuramakrishnamRaju

బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌పై లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు.

 నిన్న నిర్వహించిన మీడియా సమావేశంలో నందిగం సురేశ్‌ అసభ్య పదజాలంతో తనను దూషించారని రఘురామకృష్ణరాజు ఆరోపించారు.

దీనిపై సభాహక్కుల కింద స్పీకర్‌కు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. నిన్న నిర్వహించిన మీడియా సమావేశంలో నందిగం సురేశ్‌ మాట్లాడుతూ రఘురామకృష్ణరాజుపై త్వరలోనే అనర్హత వేటు పడుతుందని చెప్పారు.

సొంత నియోజకవర్గానికి వెళ్తే దాడి చేస్తారేమోనని భయపడే ఆయన దిల్లీలో ఉంటున్నారని ఎద్దేవా చేశారు.

ఈ వ్యాఖ్యల నేపథ్యంలో నందిగం సురేశ్‌పై ఈరోజు స్పీకర్‌కు రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు.

Related posts

సత్వర న్యాయం అందేలా న్యాయస్థానాలు చొరవతీసుకోవాలి

Satyam NEWS

జాతీయ జెండాలో కూడా కమర్షియల్ ఆలోచనలు చేస్తే ఎలా?

Satyam NEWS

వై ఎస్ జగన్ ప్రభుత్వానికి అతి పెద్ద ఎదురుదెబ్బ

Satyam NEWS

Leave a Comment