సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నటిస్తున్నదా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తున్నది. చిత్ర బృందం ఆమెతో చర్చలు జరిపినట్లు టాక్ వినిపిస్తుంది. ఇందులో హీరోతోపాటు హీరోయిన్ ప్రాతకు ప్రాధాన్యం ఉంటుందని ప్రియాంక అయితే ఆ పాత్రకు న్యాయం చేయగలరని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆమెను కథానాయికగా తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు టాక్ నడుస్తోంది. ప్రియాంక కూడా ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తిగా ఉన్నారట. ఈ పాత్ర కోసం ఆమె ప్రిపరేషన్ కూడా మొదలు పెట్టారని సోషల్ మీడియాలో పోస్ట్‌లు కనిపిస్తున్నాయి. ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించనున్నట్లు గతంలో వార్తలు జోరుగా ప్రచారం అయ్యాయి. ఇప్పుడు ప్రియాంక చోప్రా పేరు తెరపైకి వచ్చింది. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారు. భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లో దీనిని అనువదించనున్నారు. దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
previous post