27.7 C
Hyderabad
April 24, 2024 08: 46 AM
Slider జాతీయం

అత్యాచార బాధితులే అభ్యర్థులు

ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ సరికొత్త వ్యూహాలను అనుసరిస్తోంది. 40 శాతం సీట్లను మహిళలకు రిజర్వ్ చేస్తున్నట్టు ప్రకటించి, మహిళా ఓటుబ్యాంకును హస్తగతం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది.

యోగీ సర్కారు హయాంలో యూపీలో అలజడి సృష్టించిన ‘హత్రాస్’, ‘ఉన్నావ్’ వంటి అత్యాచార ఘటనల్లోని బాధిత కుటుంబాలను ఎన్ని బరిలో నిలిపేందుకు కసరత్తు చేస్తున్నారు. మొత్తంగా మహిళాశక్తిని కూడగట్టేందుకు ప్రియాంక వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

కులానికొక రాజకీయ పార్టీ ఉన్న ఉత్తర్ ప్రదేశ్‌లో ఓటర్లు ఇప్పటికే కులాలవారిగా, మతాలవారిగా చీలిపోయారు. అయితే అన్నివర్గాల్లోనూ సగానికి సగం ఉన్న మహిళా ఓటర్లకు పెద్దపీట వేస్తూ కాంగ్రెస్ తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నంలో ఉంది.

పోలికల్లో ఇందిరా గాంధీని గుర్తుకుతెస్తున్న ప్రియాంక, మహిళా శక్తిని చాటేలా ‘లడ్కీ హూఁ లడ్‌సక్తీ హూఁ’ నినాదంతో ప్రచారపర్వం చేపట్టారు. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ సర్కారు హయాంలో అవమానాలు, అత్యాచారాలు, వేధింపులకు గురైన మహిళల జాబితాను ఆమె సిద్ధం చేస్తున్నారు. ఇందులో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ‘హత్రాస్’, ‘ఉన్నావ్’ అత్యాచార బాధిత కుటుంబాలు కూడా ఉన్నాయి.

అత్యాచారాలు, వేధింపులకు వ్యతిరేకంగా పోరాడేవారికే తాను టికెట్లు ఇస్తానని ప్రియాంక గాంధీ ప్రకటించారు. తమ కోసం నిలబడాలనుకునే మహిళలు ముందుకురావాలని పిలుపునిచ్చారు. ఏ ఎమ్మెల్యే, ఎంపీ చేతిలో అన్యాయానికి గురైనవారుంటే, ఎన్నికల బరిలో నిలిచి ఎదురొడ్డాలని ధైర్యం చెబుతున్నారు ఉన్నావ్ అత్యాచార ఘటనలో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ అకృత్యాలను ప్రియాంక ఈ సందర్భంగా గుర్తుచేశారు. “మీరు ఎన్నికల్లో పోటీ చేయండి. ఎమ్మెల్యేగా గెలవండి. అధికారం చేతుల్లోకి తీసుకుని పోరాడండి.” అంటూ వ్యాఖ్యానించారు.

Related posts

సంజయ్ ను తొలగించడంపై వ్యతిరేకత షురూ

Bhavani

ట్రాజెడీ: ఢీకొన్న లారీల్లో ఒకరు సజీవ దహనం

Satyam NEWS

గువ్వలగూడా లో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

Satyam NEWS

Leave a Comment