32.7 C
Hyderabad
March 29, 2024 12: 34 PM
Slider క్రీడలు

తెలుగు టైటాన్స్‌ మ్యాచ్‌తో ప్రారంభంకానున్న ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌ 9

#prokabbadi

అపూర్వ విజయం సాధించిన ప్రో కబడ్డీ లీగ్‌ (పీకెఎల్‌) సీజన్‌8 ఇచ్చిన స్ఫూర్తితో , సీజన్‌9 బెంగళూరులో అక్టోబర్‌ 07 నుంచి ప్రారంభం కానుంది. గ్రీన్‌కో గ్రూప్‌ కో–ఫౌండర్‌ , ఛైర్మన్‌  శ్రీనివాస్‌  శ్రీరామనేని తో పాటుగా ఎన్‌ఈడీ గ్రూప్‌కు  చెందిన  మహేష్‌  కొల్లి, గౌతమ్‌ రెడ్డి లు  తెలుగు టైటాన్స్‌  సీజన్‌ 9 నూతన టీమ్‌ను పరిచయం చేశారు.

తెలుగు టైటాన్స్‌ టీమ్‌ (సీజన్‌ 9)  – రవీందర్‌ పహల్‌ (కెప్టెన్‌), సిద్దార్ధ్‌ దేశాయ్‌, అంకిత్‌ బెనివాల్‌ ; మోను గోయత్‌ ; రజ్నీష్‌, అభిషేక్‌ సింగ్‌ ; వినయ్‌; సుర్జీత్‌ సింగ్‌ ; విశాల్‌   భరద్వాజ్‌, పర్వేష్‌ భైంశ్వాల్‌, విజయ్‌ కుమార్‌, ఆదర్శ్‌ , ప్రిన్స్‌, నితిన్‌, రవీందర్‌, మోహిత్‌,  హనుమంతు, ముహమ్మద్‌   షిహాస్‌ ; పళ్ల రామకృష్ణ,  మోహసేన్‌ మగసౌద్లూ, హమీద్‌ నాడర్‌, అంకిత్‌, మోహిత్‌  పహల్‌ మరియు రిజర్వ్‌ ప్లేయర్‌గా సుమిత్‌.

తెలుగు టైటాన్స్‌ టీమ్‌ యజమాని శ్రీనివాస్‌ శ్రీరామనేని మాట్లాడుతూ ‘‘గత సీజన్‌ నుంచి నేర్చుకున్న పాఠాలతో ఈ  సీజన్‌ను విజయవంతంగా మలుచుకోవడానికి  ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము. మా నూతన స్క్వాడ్‌  కి పూర్తి శిక్షణను మా కోచింగ్‌ సిబ్బంది అందించారు. రాబోయే సీజన్‌లో  అభిమానులకు  గర్వకారణంగా మా టీమ్‌ నిలవాలని ఆకాంక్షిస్తున్నాము. మీ అందరి మద్దతు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము’’ అని అన్నారు

తెలుగు టైటాన్స్‌ టీమ్‌ యజమాని నేదురుమల్లి గౌతమ్‌ రెడ్డి మాట్లాడుతూ ‘‘సీజన్‌ 9 వివో ప్రో కబడ్డీ లీగ్‌ ప్రారంభిస్తుండటం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. మా టీమ్‌ను గత సీజన్‌తో పోలిస్తే సమూలంగా మార్చాము. ఇప్పుడు మా టీమ్‌లో అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో పాటుగా నూతన యువ ఆటగాళ్లు కూడా  ఉన్నారు. వెంకటేష్‌ గౌడ్‌ మరియు మన్జీత్‌ల కాంబినేషన్‌ ఖచ్చితంగా టీమ్‌కు కప్‌ను అందించగలదని నమ్ముతున్నాము. ఈ సంవత్సరం కప్‌ గెలవాలన్న ఏకైక లక్ష్యంతో మా టీమ్‌ పోటీపడటంతో పాటుగా  తెలుగు టైటాన్‌ స్ఫూర్తిని పునరుద్ధరించనుంది’’ అని అన్నారు.

తెలుగు టైటాన్స్‌ కోచ్‌ వెంకటేష్‌ గౌడ్‌  మాట్లాడుతూ ‘‘పర్వేష్‌ భైంశ్వాల్‌, విశాల్‌ భరద్వాజ్‌, సూర్జీత్‌ సింగ్‌ మరియు రవీందర్‌ పహల్‌లు టీమ్‌లో ఉండటం వల్ల తెలుగు టైటాన్స్‌  శక్తివంతమైన డిఫెన్స్‌ బృందాన్ని సెటప్‌ చేసింది. వీరు మా ఆటగాళ్లలో అత్యంత కీలకమైన ఆటగాళ్లు. తెలుగు టైటాన్స్‌ తమ ప్రో కబడ్డీ లీగ్‌ సీజన్‌ 9 (పీకెఎల్‌9) మ్యాచ్‌ను అక్టోబర్‌ 07న  ఈ నూతన సీజన్‌ ప్రారంభంలో భాగంగా బెంగళూరు బుల్స్‌తో  బెంగళూరులోని  శ్రీ కంఠీరవ ఇండోర్‌ స్టేడియంలో ఆడనుంది’’ అని అన్నారు.

VIVO Pro Kabaddi League Season 9 Schedule 1

DATE     DAY        TIME      MATCH

Shree Kanteerava Indoor Stadium, Bengaluru

7th Oct 2022       Friday              8:30pm onwards         Telugu Titans vs Bangaluru Bulls

9th Oct 2022       Sunday           8:30pm onwards         Telugu Titans vs Bengal Warriors

11th Oct 2022    Tuesday               8:30pm onwards              Telugu Titans vs Patna Pirates

15th Oct 2022    Saturday              8:30pm onwards              Telugu Titans vs Dabang Delhi K.C.

18th Oct 2022    Tuesday               8:30pm onwards              Telugu Titans vs Puneri Paltan   

22nd Oct 2022   Saturday              8:30pm onwards              Telugu Titans vs Jaipur Pink Panthers     

25th Oct 2022    Tuesday               8:30pm onwards              Telugu Titans vs Haryana Steelers

Shree Shivchhatrapati Sports Complex,Balewadi, Pune

29th Oct 2022    Saturday              8:30pm onwards              Telugu Titans vs Gujarat Giants

31st Oct 2022     Monday               8:30pm onwards              Telugu Titans Vs U.P. Yoddha

2nd Nov 2022     Wednesday        8:30pm onwards              Telugu Titans vs U Mumba

5th Nov 2022      Saturday              8:30pm onwards              Telugu Titans vs Tamil Thalaivas

For more details, please contact: Kalyan Chakravarthy @ 9381340098

Related posts

సింహాచలం ల్యాండ్ స్కాం లపై బిగుస్తున్న విజిలెన్స్ ఉచ్చు

Satyam NEWS

హాలీవుడ్ ను తలదన్నే గ్రాఫిక్స్ సృష్టించిన హైదరాబాద్ కంపెనీ

Satyam NEWS

స్మగ్లర్లకు సహాయం చేసిన తిరుపతి స్థానికుడి అరెస్టు

Satyam NEWS

Leave a Comment