30.7 C
Hyderabad
April 17, 2024 01: 28 AM
Slider పశ్చిమగోదావరి

చదువురాని ఆశావర్కర్ల తో ఇబ్బందులు

#ashaworker

ఏ పి లో చాలా మంది ఆశా వర్కర్ లు చదవడం, రాయడం రాని వాళ్లే ఉన్నారు. వారిలో కొంత మంది 10 వ తరగతి పాసైనట్టు మార్క్ లిస్ట్ లు సంపాదించి వాటి ఆధారంగా విధులు నిర్వహిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇలా చదువు రాని వారి వల్ల గ్రామాలలో వివిధ రకాల మందులు పంపిణీ చేసే సమయం లో ఒక మాత్ర కు బదులు మరో మాత్ర పంపిణీ చేసే ప్రమాదం లేక పోలేదనే విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.

ఆశా వర్కర్ లకు కనీస అర్హత 10 వ తరగతిగా పెట్టి వారికి రాత పరీక్ష లాంటిది నిర్వహించి క్వాలీపై అయిన వారినే ఎంపిక చేస్తే మంచిదని రాష్ట్రం లో కొందరు ఉన్నత వైద్య సిబ్బంది అభిప్రాయం పడుతున్నట్టు సమాచారం. చదవడం, రాయడం చేత కాని ఆశా వర్కర్ లకు 10 వ తరగతి పాసైన సర్టిఫికెట్స్ ఎలా వచ్చాయి? ఎవరు ఇచ్చారో విచారణ జరిపించాలని అన్ని అర్హతలున్న కొంత మంది నిరుద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

Related posts

రెలిజియనిజం: లక్ష్మణ రేఖ దాటిన అంధ మత విశ్వాసం

Satyam NEWS

అనుమానం పెనుభూతమై భార్యను హత్య చేసిన భర్త

Satyam NEWS

పారిశుద్ధ్య కార్మికులకు అండగా జనసేన

Satyam NEWS

Leave a Comment