తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు నియోజకవర్గంలోని ప్రాథమిక పాఠశాలల్లో సమస్యలు ఉన్నాయని అఖిలపక్షం ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ తెలిపారు. మౌలిక వసతులు కల్పించడంలో దృష్టి పెట్టలని, లక్షల కోట్ల అప్పులలో కనీసం వెయ్యికోట్ల పెడితే విద్యార్థులకు మేలు అవుతుంది కదా? జిల్లాకు కూత వేటు దూరంలో ఉన్న దావాజిపల్లి ప్రైమరీ స్కూల్ పై చిన్న చూపు ఉందన్నారు. మంత్రి జూపల్లి దృష్టి పెట్టాలని కోరారు. పానుగల్ మండలంలోని దావాజిపల్లి లోని ప్రైమరీ స్కూల్ ను అఖిలపక్ష ఐక్యవేదిక సందర్శించామని తెలిపారు. అక్కడ విద్యార్థులకు సరైన భవనం లేక , ఉన్న భవనానికి కాంపౌండ్ వార్డు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఇంకా కొన్ని స్కూళ్లలో సరైన రూములు లేక ఆరు బయట కూర్చుంటున్నారని చెప్పారు. ప్రభుత్వం అనవసరమైన ఖర్చులు తగ్గించి విద్యార్థులకు, వైద్యానికి ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి శ్రద్ధ వహించి విద్యార్థులకు మౌళిక సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు, బిసి జిల్లా సంఘం నేత గౌనికాడి యాదయ్య, టిడిపి రాష్ట్ర నాయకులు కొత్త గొల్ల శంకర్, బొడ్డుపల్లి సతీష్, గ్రామ ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్