క్రైస్తవుల సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని డా గంజి ఆర్ ఎజ్రా,బింకం బర్నబాస్,పాస్టర్ కె వి సాల్మన్ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ను కోరారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో శ్రీకాకుళం జిల్లా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్‌ను కలుసుకొని క్రైస్తవులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకు వెళ్లినట్లు వివరించారు. క్రైస్తవుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ వినతిపత్రం అందజేశామని చెప్పారు. క్రైస్తవులకు ప్రతీ మండలంలో స్మశానవాటిక నిర్మించాలని, ఎస్సీలు క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే బీసీ’సి’ ధ్రువపత్రాన్ని మంజూరు చేయాలని తహశీల్దార్లకు అధికారాలు ఇవ్వాలని కోరినట్టు తెలిపారు.
అదే విధంగా ఇటీవల రిమ్స్ ఆసుపత్రిలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించిన వారిపై దురుసుగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని కలక్టర్ చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. Hi టీ క్రిస్మస్ నిర్వాహకులు జిల్లా మైనారిటీ అధికారి పై చర్యలు తీసుకోవాలని కోరారు కలెక్టర్ స్పందించి త్వరలోనే సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతానని చెప్పారని వివరించారు. అనంతరం 2025 క్యాలెండర్ ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రిష్టియన్ జాయింట్ కన్వీనర్స్ రెవ ఓంపూరు రమేష్, రెవ రాడ విజయకుమార్,రెవ జి శామ్యూల్ ఆరుణు కిరణ్,పాస్టర్ రెవ జార్జి ముల్లర్. టి పీటర్,రెవ ఎ.ఇమాన్యుయేల్,పాస్టర్ యన్ శ్రీనివాస నాయక్,పాస్టర్ ప్రవీణ్ జోయ్ పాస్టర్ సి హ్ మోజెస్ తదితరులు పాల్గొన్నారు.