నిధుల దుర్వినియోగం కేసులో సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ పై క్రమశిక్షణ చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అగ్నిమాపకశాఖ డైరెక్టర్ గా ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డంపెట్టుకుని నిధుల దుర్వినియోగం చేశారని సంజయ్ పై ఆరోపణలు వచ్చాయి. అదే విధంగా ట్యాబ్ ల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని కూడా ఆరోపణలు నమోదు అయ్యాయి. అగ్ని మొబైల్ యాప్ ను జేబు సంస్థలకు కట్టబెట్టారని ఆరోపణలు ఉన్నాయి. నిబంధనల ఉల్లంఘన, క్రమశిక్షణ రాహిత్యంపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ జారీ చేస్తూ సీఎస్ విజయానంద్ ఆదేశాలు ఇచ్చారు. అభియోగాలపై నెలలోపు వివరణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. సంజయ్ అధికార దుర్వినియోగంపై విచారణ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాజకీయ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయొద్దని సంజయ్ కు హెచ్చరిక జారీ చేశారు. వేర్వేరు అభియోగాలపై ఇప్పటికే సంజయ్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
previous post
next post