39.2 C
Hyderabad
March 28, 2024 14: 19 PM
Slider మహబూబ్ నగర్

సేకరించిన వరిధాన్యం బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న వైనం

#rationrice

ప్రభుత్వం కొనుగోలు చేసిన వరి ధాన్యం బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న రైస్ మిల్లుపై సివిల్ సప్లైస్ అధికారులు పట్టుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో ఈ సంఘటన జరిగింది. గద్వాల పట్టణంలోని ఆంజనేయ ట్రేడర్స్ కు తెలంగాణ ప్రభుత్వం వరి ధాన్యం సేకరణకు అనుమతి ఇచ్చింది.

ఈ అనుమతి ప్రకారం మిల్లు యజమాని వరిధాన్యం సేకరించారు. మొత్తం వరిధాన్యంలో 85 టన్నుల వరి ధాన్యం మూడు లారీల లో లోడ్ చేస్తున్నారని సివిల్ సప్లైస్ అధికారులకు సమాచారం అందింది. గద్వాల జిల్లా సివిల్ సప్లై అధికారులు దాడి చేసి వారిని పట్టుకున్నారు.

ఈ వరి ధాన్యాన్ని తమిళనాడుకు  తరలిస్తున్నట్లు  లారీ డ్రైవర్లు తెలియజేశారు. ప్రభుత్వం అనుమతి లేకుండా ప్రభుత్వం ద్వారా  కొనుగోలు  చేసిన వడ్లను అక్రమంగా తరలిస్తున్నందున కేసు నమోదు చేశారు. వరి ధాన్యాన్ని తరలిస్తున్న మూడు లారీలను జిల్లా సివిల్ సప్లై అధికారి డి.ఎస్.ఒ రేవతి తమ ఆధీనంలోకి తీసుకొని  గద్వాల పట్టణ  పోలీస్ స్టేషన్ లో   సేఫ్ కస్టడీ కోసం ఉంచారు.

Related posts

భాగ్యనగరంలో పేలుడు పదార్థాలు

Murali Krishna

విజయనగరం లో ఖాకీలు పహారా…అల్లర్లు నియంత్రించేందుకు రంగంలో కి

Satyam NEWS

పర్యావణ పరిరక్షణకై మొక్కలను నాటుదాం

Satyam NEWS

Leave a Comment