27.7 C
Hyderabad
April 19, 2024 23: 53 PM
Slider సినిమా

వకీల్ సాబ్ నిర్మాత దిల్ రాజుకు కరోనా పాజిటివ్

#dilraju

వకీల్ సాబ్ నిర్మాత దిల్ రాజు కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. పవన్ కళ్యాణ్ తో సినిమా నిర్మించాలనే తన 22 ఏళ్ల కలను వకీల్ సాబ్ సినిమాతో నెరవేర్చుకున్న దిల్ రాజు.. ఈ సినిమా ప్ర‌చారంలో భాగంగా కొద్ది రోజులుగా ఆడియన్స్‌తో కలిసే ఉన్నాడు.

దాంతో దిల్ రాజుకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ కారణంగా హోమ్ ఐసోలేషన్‌లోకి దిల్ రాజు వెళ్లిపోయారు. కొన్ని రోజులుగా తనను కలిసిన వాళ్లందరూ వెంటనే వెళ్లి టెస్టులు చేయించుకోవాలని ఆయన కోరారు.

వకీల్ సాబ్ చిత్ర యూనిట్ తో పాటు ఆ సినిమా దర్శకుడు వేణు శ్రీరామ్ కూడా చాలా రోజుల నుంచి దిల్ రాజుతోనే ఉన్నారు.

ఇప్పటికే వకీల్ సాబ్ చిత్ర యూనిట్‌లో హీరోయిన్ నివేదా థామస్ కు కరోనా వచ్చి తగ్గిపోయింది. ఇప్పుడు నిర్మాత దిల్ రాజుకు కరోనా వచ్చింది.

దాంతో చిత్ర యూనిట్ కంగారు పడుతున్నారు. కొన్ని రోజులుగా ప్రమోషన్స్ కోసం అందరూ కలిసి ఉండటంతో ఇంకా ఎంతమందికి పాజిటివ్ వస్తుంది అనేది తెలియడం లేదు.

Related posts

నెహ్రూ విధానాలే సర్వదా ఆచరణీయం

Bhavani

ఇస్రో బాహుబలి రెడీ.. చంద్రయాన్‌ -3కు సర్వం సిద్ధం

Bhavani

రాబోయేది ప్రాంతీయ పార్టీల యుగం

Satyam NEWS

Leave a Comment