ప్రఖ్యాత సినీ నటుడు, రాజకీయనాయకుడు అయిన కమల్ హసన్ పై కేసు నమోదు అయింది. తన వద్ద తీసుకున్న పది కోట్ల రూపాయల అప్పును తిరిగి ఇవ్వకపోవడంపై నిర్మాత కె ఇ జ్ఞానవేల్ రాజా ఫిర్యాదు చేశారు. 2015 సంవత్సరంలో ఉలగనాయగన్ కమల్ హసన్ హీరోగా ఉత్తమ విలన్ సినిమా నిర్మాణం చేపట్టారు. ఫస్ట్ కాపీని లింగుస్వామి బ్యానర్ కు ఇచ్చే విధంగా ఒప్పందం జరిగింది. అయితే సినిమా విడుదల సమయంలో అందరూ ఆర్ధికంగా పూర్తిగా చితికిపోయి ఉన్నారు. దాంతో కమల్ హసన్ ఆ సమయంలో జోక్యం చేసుకుని కె ఇ జ్ఞానవేల్ రాజా నుంచి 10 కోట్ల రూపాయలు అప్పు తీసుకువచ్చారు. జ్ఞానవేల్ రాజా తో భవిష్యత్తులో ఒక సినిమా చేసి ఈ 10 కోట్ల రూపాయలు చెల్లవేస్తానని ఆ సమయంలో కమల్ హసన్ మాట ఇచ్చారు. అయితే నాలుగేళ్లు గడిచినా కమల్ హసన్ అందుకు సంబంధించిన వ్యవహారాలు తేల్చడం లేదు. కొత్త సినిమాకు డేట్ లు ఇవ్వకపోవడమే కాకుండా తీసుకున్న డబ్బు చెల్లించలేదు. ఈ మేరకు జ్ఞానవేల్ రాజా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ లోపు కమల్ హసన్ ఎన్ శంకర్ సినిమా ఇండియన్ 2 లో నటిస్తున్నాడు. అదే విధంగా కమల్ హసన్ ఇప్పటికే నటించిన తలయివాన్ ఇరుక్కిరాన్ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తమిళనాడు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌనిల్స్ ప్రతినిధి జె సతీష్ కుమార్ కమల్ హసన్ పై ఫిర్యాదు వచ్చిన విషయాన్ని ధృవీకరించారు
previous post