32.2 C
Hyderabad
March 28, 2024 23: 41 PM
Slider మహబూబ్ నగర్

వనపర్తిలో పెద్ద ఎత్తున నిషేధిత గుట్కా పట్టివేత

#wanaparthy police

వనపర్తిలో కారులో గుట్కా బ్యాగులు పట్టుకున్నామని టౌన్ ఎస్.ఐ మధుసూదన్ విలేకరులకు తెలిపారు. పట్టణ పోలీసులు పట్టణంలోని భగీరత విగ్రహం దగ్గర తెల్లవారు జామున వాహనము తనిఖీలు చేస్తుoడగా టీఎస్-06-ఇయు 9567 మారుతీ స్విఫ్ట్ డిజేర్ వాహనము ఆపి తనికి చెయ్యగా 9 భ్యాగుల గుట్కా ఉందని చెప్పారు.

అట్టి కార్ డ్రైవర్ ను విచారించగా తను పేరు ఇల్లూరి నూతను నివాసము : చిత్తనూర్ గ్రామo, మర్రికల్ మండల్ నారాయణ పేట జిల్లా అని చెప్పారని తెలిపారు.  కర్ణాకటలోని యాదగిరి నుండి  గుటకలు తెచ్చి వనపర్తి  పట్టణంలో  అమ్మాలని వస్తుండగా వనపర్తిలో  పట్టుకున్నామని,  విలువ Rs.61,600/-ఉందన్నారు.వనపర్తిలో గుట్కాలు అమ్ముతున్న వారి గురించి, వనపర్తికి రవాణా చేసే వారి గురించి సెల్ నంబర్ 9440795722కు పోన్ చేసి తనకు తెలపాలని ఆయన ప్రజలను కోరారు. సమాచారం ఇచ్చిన వారి గురించి రహస్యంగా ఉంచుతామని ఎస్.ఐ తెలిపారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ జర్నలిస్టు, సత్యం న్యూస్

Related posts

మతమార్పిడి నిరోధక బిల్లుపై రగడ

Sub Editor

మిస్ అయిన యువతి నేడు శవమై కనిపించింది

Satyam NEWS

గోల్నాక చౌరాస్తాలో డాక్టర్ బాబు జగ్జీవన్‌ రామ్ 115 వ జయంతి వేడుకలు

Satyam NEWS

Leave a Comment