37.2 C
Hyderabad
March 29, 2024 17: 27 PM
Slider ఆదిలాబాద్

పోలీసు శాఖలో పదోన్నతులతో పాటు బాధ్యతలు పెరుగుతాయి

#Adilabad Police

పోలీస్‌ అధికారులకు పదోన్నతులతో పాటు బాధ్యతలు పెరుగుతాయని జిల్లా అదనపు ఎస్పీ రాంరెడ్డి అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పనిచేస్తున్న 15 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఎ.ఎస్‌.ఐ.లుగా పదోన్నతి రాగా, నిర్మల్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న నలుగురికి(04) హెడ్‌ కానిస్టేబుళ్లకు ఎ.ఎస్‌.ఐ (ASI) పదోన్నతి లభించింది.

పదోన్నతి పొందిన వారిలో భోజా గౌడ్, రమేష్, చందర్, హీరామన్ లకు పదోన్నతి కల్పించినట్టు నిర్మల్ జిల్లా ఇంఛార్జి ఎస్పీ విష్ణు ఎస్ వారియర్, ఐపిఎస్ తెలిపారు. ఈ సందర్బంగా పదోన్నతి పొందిన పోలీస్‌ అధికారులు సోమవారం నిర్మల్ అదనపు ఎస్పీ ని మర్యాదపూర్వకంగా కలుసుకోని పుష్పగుచ్చాలు అందజేసారు.

ఈ సందర్భంగా పదోన్నతి పొందిన వారికి పదోన్నతి చిహ్నాన్ని అదనపు ఎస్పీ అలంకరించారు. ఈ కార్యక్రమం లో అదనపు ఎస్పీ మాట్లాడుతూ అధికారులు అప్పగించిన పనులు సక్రమంగా నిర్వర్తిస్తూ విధుల్లో రాణించాలని, పదోన్నతితో ఉద్యోగం పై మరింత బాధ్యతలు పెరుగుతుందని ఆయన అన్నారు.

అంకితభావంతో పనిచేసి పోలీస్ శాఖకు మంచి పేరును తీసుకురావాలని అదనపు ఎస్పీ అన్నారు. ఈ కార్యక్రమములో పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మీర్ విరాసత్ అలీ, తదితరులు పాల్గొన్నారు.

Related posts

విశాఖ ఉక్కు ప్రయివేటీకరణకు లాభనష్టాలు కొలమానం కాదు

Satyam NEWS

కూలీగా మారిన సర్పంచ్

Murali Krishna

సింహాచలంపై సీఎం జగన్ ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టేసిన హైకోర్టు

Satyam NEWS

Leave a Comment