27.7 C
Hyderabad
April 25, 2024 07: 14 AM
Slider ఆదిలాబాద్

ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు

#NirmalCollector

నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని వాక్స్ భూములు, చెరువుల శిఖం భూములు, ప్రభుత్వ ఖాళీ ప్రదేశాలు ఆక్రమణకు గురికాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మండలాలలోని ప్రభుత్వ కార్యాలయాలు, సేగ్రిగేషన్ షెడ్లు, డంపింగ్ యార్డులు, స్మశాన వాటికలు, పల్లె  ప్రకృతి వనాల హద్దులను గుర్తించి రికార్డులలో నమోదు చేయాలని సూచించారు.

అలాగే అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని బాద్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయించాలన్నారు. ప్రతి మండల కార్యాలయంలో ఈ ఆఫీస్ విధానం వందశాతం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్టిఏ, మీసేవా దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి సోమేశ్వర్, బైంసా ఆర్డీఓ రాజు, కలెక్టర్ కార్యాలయ ఏఓ కరీం, తహసీల్దార్లు సుభాష్ చందర్, నరేందర్, శివ కుమార్, కిరణ్మయి, నలంద ప్రియా తదితరులు పాల్గొన్నారు.

Related posts

జెట్ స్పీడ్: అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

Satyam NEWS

రోడ్డు ప్రమాదాలలో 10 మంది మృతి

Bhavani

భారత స్పేస్ పరిశోధనల్లో ప్రైవేటు భాగస్వామ్యం

Sub Editor

Leave a Comment