37.2 C
Hyderabad
March 28, 2024 20: 50 PM
Slider మెదక్

పారిశుద్ధ్య పనుల్లో ఉండేవారికి ప్రొటెక్షన్ తప్పని సరి

harish rao 24

మున్సిపల్, గ్రామీణ ప్రాంతాల్లో శానిటైజేషన్ పనులు తప్పకుండా నిర్వహించాలని, ఎంత ఖర్చు అయినా ఫర్వాలేదు మాస్కులు గ్లౌసులు లేకుండా పని చేయద్దని, విధులలో పాల్గొనే వారికి మాస్కులు, గ్లౌసులు తప్పకుండా ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డిని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఆదేశించారు.

సిద్ధిపేట జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి, పోలీసు కమిషనర్ జోయల్ డేవీస్, వివిధ శాఖల జిల్లా అధికారులు, ఇతర శాఖలకు చెందిన 150 మంది అధికారులతో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు మంగళవారం హైదరాబాదులోని తన నివాసం నుంచి టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ మేరకు సిద్ధిపేట సమీకృత కలెక్టరేట్ కార్యాలయం నుంచి జిల్లా అధికారులు ఈ టెలి కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  సిద్ధిపేట జిల్లాలో ఒక్క కరోనా కేసు నమోదు కాకుండా చూద్దామని మంత్రి హరీశ్ రావు అధికారులను కోరారు.

జిల్లా కలెక్టర్ నుంచి గ్రామస్థాయి అధికారి వరకు అప్రమత్తంగా పని చేయాలని కోరారు. ఇప్పటి వరకు అధికారులు, సిబ్బంది చక్కగా పని చేశారు. ఇదే స్ఫూర్తిని చివరి వరకు కొనసాగిద్దామని సూచించారు. మున్సిపల్ కమిషనర్లు, చైర్మన్లు, కౌన్సిలర్లు, గ్రామ సర్పంచ్ లు, వార్డు మెంబర్లు అంతా అప్రమత్తంగా ఉండాలి.

ప్రజలకు కరోనా వైరస్ పై అవగాహన కల్పించాలన్నారు. సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఎవరూ రోడ్ల మీదకు రావొద్దని, రాత్రి వేళ్ళలో పారిశుద్ధ్య పనులు, నిత్యావసర వస్తువులు రవాణా జరిగేలా అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

ఏదైనా సాయం అవసరమైతే ప్రజలు 100 డయల్ చేయాలని కోరారు. కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులు ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు వహించాలని, మార్కెట్ల వద్ద పర్యవేక్షణకు అధికారులకు ఏర్పాటు చేయాలనీ, ధరల పట్టికను ప్రదర్శించాలని మంత్రి సూచించారు.

సిద్ధిపేటకు ఇప్పటి వరకు 458 విదేశాల నుంచి రాగా 198 వైద్య పరీక్షలు అనంతరం 14 రోజులు గడువు ముగిసిందని ఏలాంటి ఇబ్బందులు లేవని, మిగతా వారిని క్వారంటైనులో ఉంచామని మంత్రి తెలిపారు. విదేశాల నుంచి ఏవరైనా వచ్చారా.? ఇంకా ఏవరైనా ఉన్నారా..? అన్న అంశాలపై దృష్టి సారించాలని వైద్యాదికారులకు మంత్రి సూచించారు.

 అత్యవసర విధులు నిర్వర్తించే వారు తప్పకుండా అధికారులు జారీ చేసిన పాసులు మెడలో వేసుకోవాలని ఉద్యోగులను మంత్రి కోరారు. అవసరమైన టీబీ టెస్టింగ్ కిట్స్, వ్యక్తిగత రక్షణ కల్పించే కిట్స్ తెప్పించి అందుబాటులో నిలుపుతామని తెలిపారు.

ఉగాది పండుగ సందర్బంగా పంచాంగ శ్రవణం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు గుమిగూడ కుండా గ్రామ పంచాయతీ కార్యాలయంలోని మైకు ద్వారా చదివి వినిపించేలా చర్యలు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి సురేశ్ కుమార్ ను మంత్రి ఆదేశించారు.

ఎప్పటికప్పుడు మున్సిపల్ కమిషనర్లు, చైర్మన్లు శానిటరీ పనులను పర్యవేక్షించాలని సూచించారు. గ్రామ పంచాయతీల్లో రోజుకు రెండు సార్లు మైకుల ద్వారా కరోనా వైరస్ పట్ల జాగ్రత్తలను వివరించాలని, ప్రజలను చైతన్యపర్చాలని కోరారు.

రైతుల వ్యవసాయ పనులకు ఆటంకం కలగోద్దని, ఉపాధి హామీ పనులకు అనుమతించాలని సూచించారు. ఇరిగేషన్ పనులకు ఆటంకం కలిగించవద్దన్నారు. దౌల్తాబాద్, తొగుట, గజ్వేల్, చిన్నకోడూరు ములుగు కూరగాయల మార్కెట్ల నుంచి కూరగాయల రవాణాకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని మార్కెటింగ్ శాఖ, వ్యవసాయ, హార్టి కల్చర్ శాఖ అధికారులను ఆదేశించారు.

రైతులంతా హైదరాబాదుకు వచ్చి కూరగాయలు విక్రయాలు జరపకుండా వారి తరపున ఒక్క రైతు మాత్రమే బోయిన పల్లి మార్కెట్ వచ్చి అందరి కూరగాయలు అమ్మేలా చర్యలు తీసుకోవాలని, ఆ రైతుకు రవాణా చేసే వాహనానికి డ్రైవర్ కు పాసులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.

పౌల్ట్రీ ఉత్పత్తులు తరలించే రైతుల వాహనాలకు  పాసులు ఇవ్వాలని, వాటినే అనుమతించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. విజయ, ప్రియ, ములకనూరు, కరీంనగర్ డైరీల పాల సేకరణ వాహనాల డ్రైవర్లకు పాసులు జారీ చేయాలని సూచించారు.

మండల స్థాయిలో పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రభుత్వ వైద్యులు ప్రతిరోజూ అన్నీ గ్రామాల సర్పంచ్ లతో మాట్లాడి అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకోవాలని సూచించారు. గ్రామానికి ఎవరైనా కొత్త వారు వస్తే వివరాలు సేకరించాలన్నారు.

కరోనా వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ సందర్భంగా  నిర్వర్తించే ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలగకుండా ప్రత్యేక గుర్తింపు కార్డులను, పాసులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ సీపీలను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు.

నిత్యం జరిగే వార్తలు అందిస్తున్న సిద్ధిపేట జిల్లాలోని పాత్రికేయులు, మీడియా ప్రతినిధులకు రేపే మాస్కులు అందజేయాలని మంత్రి హరీశ్ రావు ఆదేశాలు జారీచేశారు.

Related posts

నూతన కలెక్టరేట్ పనులు త్వరగా పూర్తి చేయాలి

Satyam NEWS

మరణించైనా కాపు రిజర్వేషన్లు సాధిస్తా : హరిరామజోగయ్య

Satyam NEWS

కరోనా వ్యాధి వైరస్ వ్యాప్తి నివారణకు సత్వర చర్యలు

Satyam NEWS

Leave a Comment