విజయనగరం కలెక్టరేట్ లో గజపతినగరం ఎమ్మెల్యే,రాష్ట్ర ఎన్.ఆర్.ఐ,సెర్ఫ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఉండగానే, సాక్షాత్ మంత్రి నియోజక వర్గమైన గజపతినగరం మండలంకు చెందిన ఓ అంగన్ వాడీ ఆయా తనకు పుట్టిన 11 నెలల బిడ్డతో కలెక్టరేట్ ముందే నిరసన వ్యక్తం చేసింది.అదీ తనకు ఆదార్ లేకపోవడం వల్ల తనను ఉద్యోగం లోంచి తొలగించారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అంగన్ వాడీల సమస్యలను తమ సమస్యలు భావించే ట్రేడ్ యూనియన్ సీఐటీయూ ఆ తల్లి ఆవేదన తమ భుజస్కందాలపై వేసుకుంది.దీంతో ఈ తరహా బాధితులతో పాటు అంగన్ వాడీల ఆయాలతో కలిసి విజయనగరం జిల్లా కలెక్టరేట్ అవుట్ గేట్ వద్ద ధర్నాకు ఉపక్రమించింది..సీఐటీయూ.మంత్రి శ్రీనివాస్,కలెక్టర్ తో ఆయన ఛాంబర్ లో మాట్లాడుతుండగానే సీఐటీయూ…సదరు బిడ్డ,తల్లి అయిన ఆయాతో తమ బాధను వెళ్లగక్కారు. తక్షణమే తొలగించిన ఆయాను తిరిగి విధులలోకి తీసుకోవాలంటూ డిమాండ్ చేసారు.
previous post