36.2 C
Hyderabad
April 24, 2024 20: 56 PM
Slider ఆదిలాబాద్

కార్మిక వ్యతిరేక విధానాలపై నిర్మల్ లో నిరసన

#AITUC Nirmal

కేంద్రప్రభుత్వ కార్మిక ప్రజావ్యతిరేక చర్యలకు నిరసనగా నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జాతీయ కార్మిక సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ, లాక్డౌన్ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసించారు.

ధర్నా అనంతరం కలెక్టర్ కార్యాలయ అధికారికి వినతిపత్రం సమర్పించారు. కార్మిక చట్టాల సవరణ, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, రక్షణరంగంలో 74 శాతం ప్రైవేట్ పెట్టుబడులు, పని దినాన్ని 12 గంటలకు పెంపు, వేతనాలలో కోత, కాంట్రాక్టు కార్మికుల తొలగింపు వంటి విధానాలను ప్రభుత్వం  మానుకోవాలన్నారు.

వలస కార్మికులకు ఆహారం, వైద్యం అందించి, వారి స్వస్థలాలకు పంపే ఏర్పాట్లు ప్రభుత్వం చేపట్టాలని, మరియు పని గ్యారంటీ కల్పించాలని డిమాండ్ చేశారు. అసంఘటిత కార్మికులకు నెలకు రూ.7500/- భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ నిధి నుండి నెలకు రూ.5000/- చిన్న సన్నకారు రైతులకు, చిరువ్యాపారులకు పదివేలు పరిహారం, ఉద్యోగులకు ఎలాంటి కోతలు లేకుండా పూర్తి వేతనం ఇవ్వాలని, కరోనా విధులు నిర్వహిస్తున్న ఫ్రంట్ లైన్ సిబ్బందికి రక్షణ పరికరాలు సమకూర్చాలని కోరారు.

ఈ కార్యక్రమములో AITUC నాయకులు S.N.రెడ్డి, G.S.నారాయణ, K.శ్రీనివాసచారి, K.భీంరెడ్డి, A.C.లక్ష్మణ్, ఫయాజ్, శంకర్, CITU నాయకులు రాంలక్ష్మణ్, AICTU నాయకులు జాన్ వెస్లీ, చుక్కల కళ, చాట్ల పోసక్క, BLTU నాయకులు Sd.మహమూద్, SK.మోహీనోద్దీన్, రామగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

వాన కారకుండా బకెట్లు అడ్డుపెట్టి బాలింతకు ప్రసవం

Satyam NEWS

1996 భవన నిర్మాణ కార్మిక చట్టాన్ని అమలు చేయాలి

Satyam NEWS

ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలి

Satyam NEWS

Leave a Comment