31.7 C
Hyderabad
April 25, 2024 00: 09 AM
Slider నల్గొండ

భూములను లాక్కునే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలి

#CPINalgonda

ఇండస్ట్రీయల్ పార్క్ పేరుతో పేదల భూములను తీసుకోవాలనే ప్రభుత్వ యోచన విరమించుకోకపోతే ప్రజా ఆందోళనలు తప్పవని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి సాగర్, కె.వి.పి.యస్. Tvరాష్ట్ర కార్యదర్శి టి.స్కైలాబ్ బాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం లోని చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో అసైన్డ్ భూములను కోల్పోయే రైతులను వివిధ ప్రజా సంఘాల  రాష్ట్ర నాయకులు  కలిసి  మంగళవారం నాడు మాట్లాడారు.

పేదలకు, రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామన్న కే.సీ.ఆర్. మూడెకరాల భూమి ఏమెగానీ ఉన్న భూమిని లాక్కొనే పనిలో నిమగ్నమైనారని విమర్శించారు.

ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు చేయడానికి పేదలకు ఇచ్చిన భూములను తీసుకోకుండా ఇతర ప్రత్యామ్నాయ భూములను చూడాలని కోరారు. వెలిమినేడు, గుండ్రాంపల్లి,సుంకెనపల్లి తదితర గ్రామాలలో రాంకీ సంస్థ కొనుగోలు చేసిన భూములను ,డేరా బాబా భూములను కాదని ఇంటిల్లిపాదీ చాలా కాలంగా కష్టపడి భూములను సేద్యం చేస్తున్న పేదల భూములను తీసుకోవాలనే ప్రభుత్వ యోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు.

వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు మాట్లాడుతూ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి వ్యవసాయ యేగ్యానికి ఉపయోగం గా లేని భూములను తీసుకోవాలని కోరారు.

 పేద రైతుల భూములను బలవంతంగా తీసుకుంటే సహించేది లేదని, రాజకీయాలకు అతీతంగా వివిధ రాజకీయ పార్టీలను కలుపుకొని ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇచ్చిన భూములను హరితహారం, శ్మశానవాటికలు అని  ఏదో రకంగా టి ఆర్. ఎస్ ప్రభుత్వం  బలవంతంగా తీసుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. పేద రైతుల భూములను తీసుకోనివ్వమని అన్నారు.

ఇప్పటికే వెలిమినేడు గ్రామ పంచాయతీ పాలకవర్గం, చిట్యాల మండల పరిషత్తు పాలకవర్గం రైతుల కోరిక మేరకు భూములను తీసుకోవాలనే ప్రభుత్వ యోచన విరమించుకోవాలని కోరుతూ ఏకగ్రీవంగా తీర్మానం చేసినా రైతులకు నోటీసు లు ఇవ్వడం అన్యాయం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు నారీ ఐలయ్య ,పాలడుగు నాగార్జున, బండ శ్రీ శైలం, జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య, కత్తుల లింగస్వామి, అరూరి శీను, మల్లం మహేష్, పామనుగుల్ల అచ్చాలు, ఐతరాజు నర్సింహ, శీలా రాజయ్య, రుద్రారపు పెద్దులు, అరూరి శంభయ్య, నరసింహ, జంగయ్య, మాధవి, లక్ష్మి, రేణుక, యాదమ్మ, తదితరులు పాల్గొన్నారు.

నేరడ లో……..

మండలంలోని నేరడ గ్రామంలో పేదలకు ఇండ్ల స్థలాల కొరకు కొనుగోలు చేసిన భూములను కే.వి.పి.యస్ ,రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల రాష్ట్ర కార్యదర్శులు పరిశీలించారు. మూడు వందల మంది నిరుపేదలకు ఇండ్ల నిర్మాణం కొరకు పట్టాలు ఇచ్చి, తిరిగి అదే భూమి లో చెట్లు నాటే కార్యక్రమం చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు.

పేద కుటుంబాలకు ఇచ్చిన ఇండ్ల స్థలాలను తిరిగి పేదవారికే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల రాష్ట్ర కార్యదర్శులు టి.స్కైలాబ్ బాబు, ఆర్ వెంకట్రాములు, టి సాగర్, బండ శ్రీ శైలం, పాలడుగు నాగార్జున, నారీ ఐలయ్య, జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య, కత్తుల లింగస్వామి, మల్లం మహేష్, మందుగుల యాదయ్య, కల్లూరి లక్మయ్య, అంజయ్య, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కళలకు ప్రాణం పోస్తున్న కళాకారులు

Satyam NEWS

ట్విట్టర్ డీల్ రద్దు చేసుకున్న ఎలోన్ మస్క్

Satyam NEWS

అక్రమ దందాలో బి.ఆర్.యస్. నాయకులు

Satyam NEWS

Leave a Comment