31.7 C
Hyderabad
April 19, 2024 00: 38 AM
Slider నిజామాబాద్

సమస్యల పరిష్కారానికి పారిశుద్ధ్య కార్మికుల నిరసన

#Sanitation Workers

బిచ్కుంద మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయం ముందు సి ఐ టి యు ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన చేపట్టారు , అనంతరం ఎంపీడీవో ఆనంద్ క వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా  సిఐటియు జుక్కల్ నియోజకవర్గ కన్వీనర్ సురేష్ గొండ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన జీవో 51 ప్రకారం గ్రామపంచాయతీ లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు 8500 రూపాయలు నెలకు జీతం చెల్లించాలని వారికి ఈఎస్ఐ, పిఎఫ్, యూనిఫాంలు ,శానిటైజర్ కిట్లు అందజేయాలన్నారు .

కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేనియెడల దశలవారీగా ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల అధ్యక్షులు సాయిలు, వీరయ్య, మోహన్ గౌడ్, బాలయ్య కార్మికులు ఉన్నారు.

Related posts

నంద్యాలలో జరిగినవి ఆత్మహత్యలు కాదు ప్రభుత్వ హత్యలే

Satyam NEWS

ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్ఎస్ శ్రేణులు సిద్ధం

Sub Editor

వాన కారకుండా బకెట్లు అడ్డుపెట్టి బాలింతకు ప్రసవం

Satyam NEWS

Leave a Comment