31.7 C
Hyderabad
April 19, 2024 02: 38 AM
Slider కడప

భ‌వ‌న నిర్మాణ కార్మికుల ఆధ్వ‌ర్యంలో ముట్ట‌డి

building workers

భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా
మంత్రుల క్యాంపు కార్యాలయాల ముట్టడి కార్యక్రమాన్నిక‌డ‌ప జిల్లా భవన నిర్మాణ కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ముట్టడి కార్యక్రమం నిర్వ‌హించారు.

నగరంలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా క్యాంపు కార్యాలయాన్నిముట్టడించేందుకు జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు ప్ర‌య‌త్నించారు. డిప్యూటీ సీఎం అంజాద్ భాషకు సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ వినతి పత్రాన్నిఅందజేశారు. కరోనా విపత్తు లో ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు 10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించాల‌ని డిమాండ్ చేశారు.

స‌మ‌స్య‌లు సీఎం దృష్టికి తీసుకువెళ‌తాం

డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్నసమస్యలను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్తామ‌న్నారు. భవన నిర్మాణ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కారం కోసం తాను కృషి చేస్తాన‌ని చెప్పారు. నూతన ఇసుక పాలసీ ని ముఖ్యమంత్రి తీసుకువచ్చార‌న్న విష‌యాన్ని గుర్తు చేశారు. నూతన పాలసీ ద్వారా ఇసుక అందరికీ అందేలా చూస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.

Related posts

బాలకృష్ణ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ కు అనుమతి

Satyam NEWS

రిటర్నింగ్ అధికారిని చంపుతామని బిజెపి భయపెట్టింది

Satyam NEWS

రేపు హుజూర్ నగర్ కు రానున్న వైఎస్ షర్మిల

Satyam NEWS

Leave a Comment