38.2 C
Hyderabad
April 25, 2024 14: 50 PM
Slider విజయనగరం

జాబ్ క్యాలెండ‌ర్ ప్ర‌క‌టించ‌క‌పోవ‌డాన్ని నిర‌సిస్తూ 10 న క‌లెక్ట‌రేట్ వ‌ద్ద ధ‌ర్నా

#tnsf

ఎట్టి పరిస్థితుల్లోనైనా ఖాళీ పోస్టులు భర్తీచేసి, నిరుద్యోగుల పొట్ట కొట్టే ఉద్యోగుల పదవీవిరమణ వయసు పెంపు జి.ఓ ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని  లేకుంటే నిరుద్యోగుల పక్షాన పోరాటం తీవ్రం చేస్తామని తెలుగు యువత, టీఎన్ఎస్ఎప్ నేత‌లు హెచ్చరించారు.

ఈ నెల  10న కలెక్టరేట్ వద్ద జరగనున్న నిరసనకు నిరుద్యోగులంతా స్వచ్చందంగా తరలిరావాలని పిలుపునిచ్చారు…టీఎన్ఎస్ఎఫ్ నేతలు. ఈ మేర‌కు ఏపీ రాష్ట్రంలో టీడీపీ  కార్యాల‌యమైన కేంద్ర మాజీమంత్రి  అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా  సమావేశంలో టీఎన్ఎస్ఎఫ్ నేత‌లు మాట్లాడారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీపోస్టులు భర్తీచేయాలని నూతన జాబ్ క్యాలెండర్  విడుద‌ల‌కు డిమాండ్ చేస్తూ నిరుద్యోగులకు నష్టం చేకూర్చే ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంపుదలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసారు. అందుకు నిర‌స‌న‌గా ఈ నెల 10  క‌లెక్ట‌రేట్ వ‌ద్ద నిర‌స‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్న‌ట్టు నేత‌లు తెలిపారు.

ఈ మేర‌కు నిర‌స‌న‌కు ..ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ,ఎన్ఎస్యూఐ,ఏవైయూఎఫ్,పీడీఎస్యూ, పీవైఎల్ సంఘాలు త‌మ మ‌ద్ద‌తు తెలియ చేస్తూ.పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేసారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో  6 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇస్తూ ఉంటే జగన్ ప్ర‌భుత్ర‌వం దాన్ని రద్దు చేసి నిరుద్యోగులకు  ద్రోహం చేసిందిన్నారు.

అదీ  కాక ఇప్పుడు జాబు క్యాలెండర్ లో జాబులు పెట్టకుండా ఖాళీపోస్టులు భర్తీ చెయ్యకుండా మీనమేషాలు లెక్కపెడుతూ కాలం వెళ్లబుచ్చుతున్నారని విమ‌ర్శించారు. ఉద్యోగుల పదవీవిరమణ వయసు 60 నుండి 62 సంవత్సరాలకు పెంచటం వల్ల అటు నిరుద్యోగులకు ఉద్యోగాలను ఎగ్గొట్ట‌డం..ఇ   టు ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రెండు ఎగ్గొటే దురాలోచనతోనే జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఈ నిర్ణయం తీసున్న‌ట్టు తెలుస్తోంద‌న్నారు. ఈ నిరయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని లేకుంటే ఆందోళ తీవ్రతరం చేస్తామ‌ని అన్ని విద్యార్ది సంఘాలు స్పష్టం చేసారు.

Related posts

ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి

Satyam NEWS

పిల్లల రక్షణలో అశ్రద్ధ చూపద్దు

Satyam NEWS

నేరస్తులకు శిక్ష వేయించడంతో నాగర్ కర్నూల్ టాప్

Satyam NEWS

Leave a Comment